← Back to news

ట్రంప్‌కు సొంత పార్టీ షాక్

By aravinda nyayapati· 4 Jun 2026
ట్రంప్‌కు సొంత పార్టీ షాక్

ఇరాన్‌ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించడానికి వీల్లేదంటూ War Powers Resolutionను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. 215-208 ఓట్లతో ఆమోదం పొందిన ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ అనుమతి లేనిదే ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకోకూడదు. అయితే ఇది అమల్లోకి రావాలంటే సెనేట్ ఆమోదం, ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది.

More in World