← Back to news

6న జంతర్ మంతర్ వద్ద CJP భారీ నిరసన

By aravinda nyayapati· 4 Jun 2026
6న జంతర్ మంతర్ వద్ద CJP భారీ నిరసన

ఇన్‌స్టాగ్రామ్‌లో కోటిమందికి పైగా ఫాలోవర్లతో వైరల్ అయిన Cockroach Janta Party (CJP) భారీ నిరసనకు సిద్ధమైంది. ఈ పార్టీ ప్రతినిధులు విజేత దహియా, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. NEET పేపర్ లీక్స్, CBSE ఎగ్జామ్స్ వివాదాలపై వీరు గళమెత్తబోతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. అమెరికా నుంచి వస్తున్న పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో ఈ నిరసన జరగనుంది. ప్రధాన్ రాజీనామా చేసేదాక నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ పార్టీలో ఎవరైనా చేరవచ్చునని వారు పిలుపునిచ్చారు.

More in India