Latest

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ సెకండియర్(ఎంపీసీ) స్టూడెంట్ వనం అఖిల రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఈ నెల 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 హైజంప్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ పొందింది. ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.
పండగపూట ఆర్టీసీ బాదుడు
TG: హైదరాబాద్ నుంచి కరీంనగర్ సాధారణ రోజుల్లో రూ.290 ఉంటే రాఖీ రోజు రూ.400కు పెంచడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో చార్జీల బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచడం సరికాదంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పెట్టాలంటే ఇలా అదనంగా వసూళ్లు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.

ధర్మారం ఎస్‌ఐగా ఎంబడి శ్రీకాంత్
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.
రోడ్డుపై బస్సు ఆపి..తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
TG: రాఖీ పండగ వేళ ఒక అక్క తన తమ్ముడి కోసం క్రేజీ మూమెంట్ క్రియేట్ చేసింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC డ్రైవర్ రాజు కరీంనగర్ తిమ్మాపూర్ దగ్గర డ్యూటీలో ఉన్నాడు. అతని అక్క స్వప్న, హైవేపై బస్సు ఆపించి మరీ తన తమ్ముడికి రాఖీ కట్టింది. రోడ్డుపైన జరిగిన ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ సీన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CM రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు
TG: రాఖీ పండుగ సందర్భంగా CM రేవంత్‌రెడ్డిని మహిళా ప్రతినిధులు, నేతలు, స్టూడెంట్స్ కలిశారు. రేవంత్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా సీఎంకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి కూడా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

చంద్రబాబుకు మహిళా నేతల రాఖీ
AP: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆచంట సునీత సీఎంకు రాఖీ కట్టారు. తరువాత చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అథ్లెటిక్స్‌లో గెలుపు.. నేషనల్స్‌లో ఎంట్రీ
TG: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కి చెందిన నల్లవెల్లి ఆనంది హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ మీట్ అథ్లెటిక్స్ కాంపిటీషన్‌లో అదరగొట్టింది. అండర్-18 కేటగిరీలో 200, 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లలో రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఈ గెలుపుతో ఆనంది సెప్టెంబరులో పుదుచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్‌కు సెలెక్ట్ అయింది. ఈ సక్సెస్ సాధించిన ఆనందికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెంబర్స్, కోచ్ సుబ్బారావు విష్ చేశారు. నేషనల్స్‌లో కూడా పతకాలు గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

విదేశీ రెస్క్యు టీంలకు నేపాల్ నో
భారత్ (NDRF బృందాలు), చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ సొంత డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లను నేరుగా రంగంలోకి దించుతామని ప్రతిపాదించాయి. కానీ నేపాల్ విదేశాంగ శాఖ ఈ ప్రపోజల్‌ను తిరస్కరించింది. తమ ఆర్మీ, పోలీస్ బలగాలు అన్వేషణ, రెస్క్యూ చర్యలను సమర్థవంతంగా నిర్వహించగలవని తెలిపింది. 2015లో భారీ భూకంపం వచ్చినప్పుడు అనేక దేశాల నుండి వందలాది రెస్క్యూ బృందాలు ఒకేసారి రావడం వల్ల క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి పెద్ద గందరగోళం నెలకొంది. ఈసారి ఆ తప్పు జరగకూడదని నేపాల్ భావిస్తోంది.

24 ఏళ్ల తర్వాత కొడుకుతో ఇంటి ముందు మహిళ ధర్నా
గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీలో ఓ మహిళ ధర్నా చేపట్టింది. 24 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో పని చేసే టైంలో యజమాని కుమారుడు తనపై లైంగికదాడి చేశారని, దాంతో తనకు కొడుకు పుట్టాడని వివరించింది. అతడే తన కొడుకుకు తండ్రి అని ఆరోపిస్తూ కొడుకుతో కలిసి ధర్నాకు దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదని, నిజానిజాలు తేలడానికి డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమేనని ప్రకటించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి
పూణేలో ఘోరమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల యువకుడు మహేష్ గైక్వాడ్‌ను అతని తండ్రే కొట్టి చంపేశాడు. దీనికి కారణం మటన్. శ్రావణమాసంలో కొన్ని కుటుంబాలు నాన్ వెజ్ తినరు. మహేష్ కుటుంబం కూడా అలాగే తినడం లేదు. కానీ ఇంట్లోనే మటన్ వండాలని అతను బలవంతం చేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య వాదన జరిగింది. దీంతో కోపంతో కొడుకును బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ మహేష్ చనిపోయాడు.

ఫ్రీడమ్ ఫైటర్స్ కథతో వెబ్ సిరీస్
బ్రిటిష్ వాళ్లని ఎదిరించి ఆయుధాలు పట్టిన మన విప్లవ వీరుల రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న ‘The Revolution’ అనే వెబ్ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సంజీవ్ సన్యాల్ రాసిన బుక్ ఆధారంగా డైరెక్టర్ నిఖిల్ అద్వానీ దీన్ని తెరకెక్కించారు. ఇందులో భువన్ బామ్, రోహిత్ సరాఫ్, ప్రతిభా రంతా, గుర్ఫతే పిర్జాదా మెయిన్ రోల్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకు కొత్త డైలీ ట్రైన్!
వరంగల్, విజయవాడ ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దానాపూర్–బెంగళూర్ స్పెషల్ ట్రైన్లను ఇకపై డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లుగా నడపనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి వరంగల్, విజయవాడ నుంచి దానాపూర్, బెంగళూరుకు డైలీ ట్రైన్ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. దానాపూర్–బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ (22365) వరంగల్‌కు రాత్రి 7.00, విజయవాడ 11.35 గం. చేరుతుంది. బెంగళూర్–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (22366) విజయవాడకు సా. 2.55, వరంగల్‌కు 6.18 గం. చేరుతుంది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ఈ మార్పు చేశారు.

APకి భారీ డిజిటల్ బూస్ట్.. విశాఖకు కొత్త కనెక్టివిటీ!
AP: రాష్ట్రానికి మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ ఎదగనుంది. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, AI ఫెసిలిటీ రానున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా టెక్ దిగ్గజాలు సముద్రం కింద ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఆల్మోస్ట్ 3,600 కి.మీ I-2SEA కేబుల్‌తో విశాఖకు సింగపూర్, సౌత్‌ఈస్ట్ ఏషియాతో నేరుగా కనెక్టివిటీ వస్తుంది. 2029 చివరి నాటికి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అక్రమ బ్లాస్టింగ్‌ను నిలిపివేయాలి: గొంగళ్ల రంజిత్
TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురంలో అక్రమ బ్లాస్టింగ్‌తో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్‌ఎస్ గద్వాల ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం రైతులతో కలిసి బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రషర్ మిషన్, పేలుళ్ల కారణంగా ఇళ్లు బీటలు వారడంతో పాటు పంటలు, బోర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బ్లాస్టింగ్‌ను వెంటనే నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

రాఖీ పౌర్ణమి వేళ బీజేపీ నేతలతో ఆత్మీయ కలయిక
TG: రంగారెడ్డి జిల్లా హఫీజ్‌పేట్ డివిజన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేశ్ యాదవ్ శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అనుషా మహేశ్ యాదవ్ పేర్కొన్నారు.

8 ఏళ్ల తెలుగు అమ్మాయి చెస్‌లో వరల్డ్ రికార్డ్
డల్లాస్‌లో ఉండే తెలుగు చిన్నారి సరయు తలపనేని చెస్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. 3వ తరగతి చదువుతున్న ఈ 8 ఏళ్ల పాప, కొలంబియాలో జరిగిన ‘పాన్-అమెరికన్’ చెస్ కాంపిటీషన్‌లో 9కి 9 రౌండ్లు గెలిచి కాంటినెంటల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఏడు దేశాల ప్లేయర్లతో ఆడి ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా పర్ఫెక్ట్ స్కోర్ సాధించింది. వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవ్వడమే కాక, ఫిడే విమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ రేసులో నిలిచిన యంగెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా నిలిచింది.

డ్యూటీలోనే రాఖీ పండుగ
TG: నల్గొండ ఆర్టీసీ డిపోలో రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాతమ్ముళ్ల అనురాగంతో పాటు ప్రజా సేవకు అంకితభావం చాటిచెప్పే ముచ్చటైన దృశ్యం కనిపించింది. అదే డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీల, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న తన తమ్ముడు శ్రీనుకు డిపో ప్రాంగణంలోనే రాఖీ కట్టారు. పండుగ రోజైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతతో ఇద్దరూ విధులకు హాజరయ్యారు. అక్క ప్రవీల తమ్ముడికి రాఖీ కట్టి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ తమ తమ విధుల్లో నిమగ్నమయ్యారు.

సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య
థానే జిల్లా డొంబివలి(తూర్పు) సైరామ్ సొసైటీలో దేవికా అర్ముగం పండరం(38) సూసైడ్ చేసుకున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్‌ను సైబర్ మోసాల్లో వాడారని రాజస్థాన్‌లోని చురు పోలీసులు ఆగస్టు 8న ఆమె ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారు. దీనిపై క్లారిటీ కోసం ఆమె థానే పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లారు. అక్కడ హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో ఆమెపై సైబర్ మోసం కేసులున్నాయని చెప్పారు. దీంతో భయపడ్డ ఆమె బ్లేడ్‌తో చేయి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అదే మా అన్న నాకిచ్చే అతిపెద్ద సపోర్ట్: సుప్రియ
రాఖీ పండుగ సందర్భంగా హీరో సుమంత్ చెల్లెలు సుప్రియ అన్నతో తన బాండింగ్‌ని పంచుకున్నారు. "చిన్నప్పుడు సుమంత్ చాలా సైలెంట్‌గా ఉంటే, నేను మాత్రం బాగా అల్లరి చేసేదాన్ని. స్కూల్ రోజుల్లో విడివిడిగానే ఉన్నా, పెద్దయ్యే కొద్దీ మా మధ్య బాండింగ్ బాగా పెరిగింది" అని సుప్రియ తెలిపారు. తనకు పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చే అలవాటు లేదని, రాఖీ కట్టి ఒక్కరికొక్కరు తోడుగా ఉన్నామని చెప్పుకోవడమే అసలైన పండుగ అని సుప్రియ అన్నారు. సుమంత్ తప్పొప్పులను సూటిగా చెబుతాడని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాడని ఆమె చెప్పింది.

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కొత్త అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అరకు ఎంపీ తనూజారాణి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నోఖ్వాల్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాలలో ఈ అంబులెన్స్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఇండియా పోస్ట్‌లో 25 వేలకుపైగా GDS ఉద్యోగాలు
ఇండియా పోస్ట్‌లో GDS, BPM, ABPM పోస్టులకు 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 31-సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్ సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఉంటుంది. జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click</a> చేయండి.