Latest

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్
Local· 28 Aug 2026

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్‌లో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని సూచించారు.

రాఖీ వేడుకల్లో గంప గోవర్ధన్
Local· 28 Aug 2026

రాఖీ వేడుకల్లో గంప గోవర్ధన్

TG: కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రాఖీ పౌర్ణమి వేడుకలను తన అక్కలతో కలిసి ఆత్మీయంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అక్కలు సుగుణ, ప్రమీల, విమల గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టారు. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కల నుంచి రాఖీలు కట్టించుకున్న గంప గోవర్ధన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన
Local· 28 Aug 2026

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన

TG: జోగులాంబగద్వాల జిల్లాలో RDS (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కెనాల్‌ దుస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కెనాల్‌కు సాగునీరు విడుదల చేసినా కాలువలో నీరు సక్రమంగా ప్రవహించి పొలాలకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ కంపచెట్లు, ముళ్లపొదలతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. పలుచోట్ల లైనింగ్‌ దెబ్బతిని పెచ్చులూడిపోవడంతో నీరు లీకై వృథాగా పోయే ప్రమాదం ఉందన్నారు. సాగు సమయంలో నీరు సక్రమంగా అందకపోతే పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన
Local· 28 Aug 2026

రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన

TG: “అన్నా.. హెల్మెట్ పెట్టుకో.. నీ కుటుంబం నీ కోసం ఎదురుచూస్తోంది” అంటూ మహిళా ట్రాఫిక్ పోలీసులు రాఖీలు కట్టి చెప్పిన మాటలు కామారెడ్డిలో వాహనదారులను ఆలోచింపజేశాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారిని మహిళా ట్రాఫిక్ పోలీసులు ఆపి రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. చలానాలు విధించడం కంటే ప్రజల్లో బాధ్యత, భద్రతపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.

బురద రోడ్డుపై రాకపోకలు
AP· 28 Aug 2026

బురద రోడ్డుపై రాకపోకలు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో రెండుకిలోమీటర్ల మట్టి రోడ్డుతో 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపాకగొమ్ము పంచాయతీ పరిధిలోని ఈ రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో రాకపోకలు దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అంగన్‌వాడీలో 231 టీచర్, ఆయా పోస్టులు
TG· 28 Aug 2026

అంగన్‌వాడీలో 231 టీచర్, ఆయా పోస్టులు

TG: మహబూబాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 231 పోస్టులున్నాయి. అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు మినిమమ్ Intermediate పాస్ అయ్యుండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ లేదా 10వ తరగతి పాస్ కావాలి. ఏజ్ 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసి, అకాడెమిక్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం <a href="https://wdcw.tg.nic.in/">వెబ్‌సైట్‌</a>ను చుడండి.

అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ
Local· 28 Aug 2026

అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ

TG: గ్రామపంచాయతీ కార్మికులపై బోధన్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఎం. రమేష్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే గ్రామపంచాయతీ కార్మికుల వల్లే గ్రామాల అభివృద్ధి ఆగిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.

‘భోగి’ నుంచి అదిరిపోయే పోస్టర్!
Entertainment· 28 Aug 2026

‘భోగి’ నుంచి అదిరిపోయే పోస్టర్!

హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘భోగి’. రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి 'గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు' అనే క్యాప్షన్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, చేతిలో తాటి ముంజలు కోస్తూ శర్వానంద్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర బోర్డర్‌లో జరిగే కథ ఇది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా, త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
Local· 28 Aug 2026

రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ రాఖీ పౌర్ణమి సందర్భంగా తన అక్కాచెల్లెళ్లతో ఆత్మీయంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. సోదరీమణులు ప్రేమపూర్వకంగా రాఖీలు కట్టగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆనందంగా స్వీకరించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు జీవితాంతం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధాన్ని మరింత బలపరిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు.

10th ఫ్లోర్ నుంచి జారిపడ్డా..చెట్టు కాపాడింది
Viral· 28 Aug 2026

10th ఫ్లోర్ నుంచి జారిపడ్డా..చెట్టు కాపాడింది

ముంబై భాండుప్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రీసెంట్‌గా పెళ్లైన ఓ మహిళ 10th ఫ్లోర్ నుంచి కిందపడింది. మధ్యలో ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. భూమికి 20–25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకున్న ఆమెను ముంబై ఫైర్‌ బ్రిగేడ్ సిబ్బంది హుక్‌ ల్యాడర్‌తో సేఫ్‌గా కిందికి తీసుకొచ్చారు. తరువాత ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వృక్షో రక్షతి రక్షిత: అంటే ఇదే కావొచ్చు.

కసిరెడ్డి, వంశీచంద్ రెడ్డికి రాఖీ కట్టిన గీత
Local· 28 Aug 2026

కసిరెడ్డి, వంశీచంద్ రెడ్డికి రాఖీ కట్టిన గీత

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని వారి నివాసాలకు వెళ్లిన గీత ఇరువురినీ కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గీతను అభినందించారు. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

‘స్పెషల్ బస్సు’ చార్జీలను వెంటనే తగ్గించాలి
Local· 28 Aug 2026

‘స్పెషల్ బస్సు’ చార్జీలను వెంటనే తగ్గించాలి

రక్షాబంధన్ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులపై ‘స్పెషల్ బస్సులు’ పేరుతో అదనపు చార్జీలు మోపడం దారుణమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గప్రసాద్ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టి, ప్రయాణికులతో రాఖీలు కట్టించుకుని ఆందోళన నిర్వహించారు. పండుగల సమయంలో అదనపు బస్సులు నడపడం స్వాగతించదగ్గదేనని, కానీ అదనపు చార్జీలు వసూలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

MMTSలో ఇక ఏసీ జర్నీ.. త్వరలో కొత్త రైళ్లు!
Current Affairs· 28 Aug 2026

MMTSలో ఇక ఏసీ జర్నీ.. త్వరలో కొత్త రైళ్లు!

హైదరాబాద్‌ MMTS ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. రైల్వేబోర్డు ఆదేశాలతో South Central Railway ఏసీ కోచ్‌లపై ప్లాన్‌ చేస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఒక్కో MMTS రైలుకు 2–4 ఏసీ కోచ్‌లు అటాచ్ చేయనున్నారు. సెకండ్ ఫేజ్‌లో పూర్తిగా ఏసీ MMTS రైళ్లను నడిపేలా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. డిమాండ్‌ పెరగడంతో 3 రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల్లో వందల ఏసీ కోచ్‌ల తయారీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 2027 ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఘట్‌కేసర్‌–యాదాద్రి ఎక్స్‌పాన్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు
National· 28 Aug 2026

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు

దేశంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు ఉదయం 6:30 గం. సమయానికి దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1,63,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,49,540గా నమోదైంది. కిలో వెండి రూ.2,59,900కి పడిపోయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,970, 22 క్యారెట్ల ధర రూ.1,49,390గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ ఇదే బంగారం ధరలు కొనసాగగా.. కిలో వెండి రూ.2,64,900గా నమోదైంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

వీరయ్య - మరువలేని చరిత్రకి పుస్తక రూపం
Arts/Literature· 28 Aug 2026

వీరయ్య - మరువలేని చరిత్రకి పుస్తక రూపం

కృష్ణ గుబిలి రాసిన ‘వీరయ్య’ పుస్తకం మరుగున పడ్డ చరిత్ర. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా తెలుగులో వచ్చిన ఈ రచన రచయిత ముత్తాత జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తుంది. 19వ శతాబ్దం చివర్లో సౌత్ ఆఫ్రికా చెరుకు తోటలకు కూలీలు అవసరమయ్యారు. 13 లక్షల మంది భారతీయులను బ్రిటీష్ వాళ్లు సముద్రం దాటించారు. వాళ్లలో ఒకరు కృష్ణా జిల్లా కొర్లపాడుకు చెందిన వీరయ్య. అక్కడ తోటల్లో వాళ్ల జీవితం..ఆపై 1932లో ఆయన తిరిగి ఈ దేశానికి వచ్చాక జరిగిన విషయాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ధర.300. కొనే <a href="https://www.telugubooks.in/products/viriah?srsltid=AfmBOoqz_4iNbW8x6s5-hNBpPGv082K1uEXzp-WQbQnto-XGVIWu8-VG">లింక్</a> ఇది.

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు
Local· 28 Aug 2026

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు

TG: విద్యుత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్మారక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో నూతన విద్యుత్ సవరణ చట్టం రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

సోనియా గాంధీ పుస్తకంపై Penguin Random House India ప్రకటన
Arts/Literature· 28 Aug 2026

సోనియా గాంధీ పుస్తకంపై Penguin Random House India ప్రకటన

సోనియా గాంధీ రాసిన 'Belonging: A Journey of Love' పుస్తకానికి తాము పబ్లిషర్స్ కాదని Penguin Random House India చెప్పింది. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. Editorial Changesకు సోనియా గాంధీ నో అనడంతో పెంగ్విన్ వెనక్కి తగ్గిందని కొన్ని వార్తల రావడంతో ఈ ప్రకటన వచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆసక్తిగా ఉన్నామని చెప్పింది.

టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టిన టెంపో
AP· 28 Aug 2026

టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టిన టెంపో

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న టెంపో టైరు ఒక్కసారిగా పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుమలకు పెళ్లి కోసం వెళ్తుండగా టైరు పేలడంతో అదుపుతప్పిన టెంపో డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనంలో 11 మంది ప్రయాణిస్తుండగా పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా కృష్ణా జిల్లా గూడూరుకు చెందినవారిగా గుర్తించారు.

11 ఏళ్ల అమ్మాయిపై హెడ్‌మాస్టర్ అత్యాచారం
Crime· 28 Aug 2026

11 ఏళ్ల అమ్మాయిపై హెడ్‌మాస్టర్ అత్యాచారం

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ 11 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆగస్టు 11న మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 మధ్య గ్రామ స్మశానం దగ్గర ఈ ఘటన జరిగింది. అమ్మాయి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత, POCSO చట్టం కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు
Infotainment· 28 Aug 2026

ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు

దేశం అంతటా రక్షాబంధన్‌ వైభవంగా జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా ఈ పండుగను జరుపుకోవడం లేదు. UPలోని సథా, ధౌలానా ప్రజలు మహారాణా ప్రతాప్ వంశస్తులు. రాఖీ పండుగ రోజునే జరిగిన ఒక యుద్ధంలో వారి పూర్వీకులు ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారు. రాజస్థాన్‌లోని పాలిలో రాఖీ పండుగ రోజునే పాలివాల్ బ్రాహ్మణులపై మహమ్మద్ ఘోరీ దాడి చేసి దారుణంగా చంపేశాడు. అందుకే ఈ రోజును వారు పండుగగా కాకుండా విషాద దినంగా భావిస్తారు.

బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్
Local· 28 Aug 2026

బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాంలో రౌడీషీటర్‌తోపాటు మరోఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి డబ్బులు, బైక్ లాక్కున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజాం మెంతిపేటకు చెందిన రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు అలియాస్ దేవా, పెనుబాకకు చెందిన దిలీప్, ప్రసాద్‌లు ఫైర్‌స్టేషన్ మామిడితోట వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించారు. తమ వద్ద ఉన్న డబ్బులు, బైక్ ఇవ్వకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు భయపడి వాటిని అప్పగించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.