5 ఏళ్లలో ప్లంబర్ దొరకడం కష్టమే..!

ఇండియాలో రాబోయే రోజుల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు దొరకడం కష్టమైపోతుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగం, డెలివరీ యాప్స్ (గిగ్ ఎకానమీ) క్రేజ్‌తో యంగ్ జనరేషన్ అంతా అటువైపే వెళ్తుండటంతో ట్రెడిషనల్ బ్లూ కాలర్ స్కిల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. నిర్మాణ రంగానికే దాదాపు 20 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తెలిపింది. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్న వృత్తులుగా మారాయి. మరోవైపు దేశంలో కేవలం 4.1% వర్క్‌ఫోర్స్‌కే ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ అందుబాటులో ఉంది.


