Latest

ఆటో డ్రైవర్ చేసిన సాయం!
Motivational· 27 Aug 2026

ఆటో డ్రైవర్ చేసిన సాయం!

బెంగళూరులో ఓ మహిళ స్కూటీ మధ్యలోనే ఆగిపోయింది.. ఏం చేయాలో తెలియక రోడ్డుపై ఇబ్బంది పడుతుండగా, పక్కనే వెళ్తున్న ఆటో డ్రైవర్ తంజీమ్ ఆమెకు సాయం చేయడానికి ఆగాడు. తన ఆటోతో పాటు స్కూటీని నెమ్మదిగా ముందుకు నెట్టుకుంటూ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఆమెకు తోడుగా వెళ్లాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. డబ్బులు తీసుకోకుండా ఓ అపరిచితురాలికి ఇలా సాయం చేసిన తంజీమ్‌ను చూసి నెటిజన్లు.. “ఇంకా మనుషుల్లో మంచితనం ఉంది” అంటూ ప్రశంసిస్తున్నారు.

డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో లక్కీ డ్రా పేరిట కొత్త ట్విస్ట్
Local· 27 Aug 2026

డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో లక్కీ డ్రా పేరిట కొత్త ట్విస్ట్

మందమర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అలకేషన్లో రోజుకో ట్విస్ట్. అర్హుల జాబితాలో అక్రమాలు బయట పడగానే అధికారులు కొత్త డ్రామాకు తెరతీశారట. ఇదుగో అర్హుల జాబితా అంటూ ఒక లిస్ట్ చూపెట్టారు. లక్కీ డ్రా ద్వారా ఇస్తామన్నారు. ట్విస్ట్ ఏంటంటే 2daysలోనే అర్హుల జాబితా 447 నుంచి 491కి పెరిగింది. ఇంకా షాకింగ్ విషయం – ఈ లక్కీ డ్రాలో బీసీలను జనరల్ లిస్టులో చేర్చారు. పెళ్లి కాని వారు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు, రేషన్ కార్డు కూడా లేని వారికి ఇళ్లు కేటాయిస్తున్నారు. పారదర్శకత కావాలన్నది ప్రజల డిమాండ్..

PRC నివెంటనే ప్రకటించాలి
Local· 27 Aug 2026

PRC నివెంటనే ప్రకటించాలి

PRC నివెంటనే ప్రకటించాలని TGE JAC ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించారు. CPS విధానా న్ని రద్దు చేసి, OPS విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్‌లో ఉన్న డీఏలతోపాటు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని కెోరారు.

Acting Chief Justiceని మార్చాలని..సుప్రీం జడ్జి లెటర్స్
National· 27 Aug 2026

Acting Chief Justiceని మార్చాలని..సుప్రీం జడ్జి లెటర్స్

రాజస్థాన్ హైకోర్టు Acting Chief Justice జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మను బదిలీ చేయాలని CJI సూర్యకాంత్‌కు సుప్రీం కోర్టు జడ్జి సందీప్ మెహతా ఏకంగా మూడు లెటర్స్ రాయడం ప్రస్తుతం చర్చగా మారింది. Acting Chief Justiceలో నాయకత్వ లక్షణాలు లేవని, కేసులు అనవసరంగా తన బెంచ్‌కు మార్చుకుంటున్నారని ఆ లెటర్స్‌లో ఆయన వివరించారు. హైకోర్టు గెస్ట్‌హౌస్ కోసం అవసరం లేకుండా పెద్ద భవనం నిర్మించాలని ప్లాన్ చేసి ప్రజా డబ్బు వేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ శర్మ గత ఏడాది సెప్టెంబర్ నుంచి యాక్టింగ్ చీఫ్‌గా ఉన్నారు.

మల్కాపూర్ తండాలో SIR ఓటర్ నివేదిక
Local· 27 Aug 2026

మల్కాపూర్ తండాలో SIR ఓటర్ నివేదిక

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండా పరిధిలో SIR ఓటర్ నివేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ పార్టీల BLAలతోపాటు BRS నాయకులు కేతావత్ గంగారాం నాయక్, బానోత్ గోపాల్ నాయక్, విశ్లావత్ అరవింద్, విశ్లావత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఓటరు జాబితాపై చర్చించి, వివరాలను పరిశీలించారు.

ప్రమాద బాధితులను ఆదుకోవాలి: విడదల రజిని
Local· 27 Aug 2026

ప్రమాద బాధితులను ఆదుకోవాలి: విడదల రజిని

AP: చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రూ.22,006 కోట్లు అప్పులు..రూ.6.5 కోట్లకు ఫైనల్
Current Affairs· 27 Aug 2026

రూ.22,006 కోట్లు అప్పులు..రూ.6.5 కోట్లకు ఫైనల్

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రా Personal Insolvency కేసులో జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ కీలక ఆర్డర్ ఇచ్చింది. రూ.22,006.57 కోట్ల లోన్లలో సుభాష్ రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తారని చెప్పింది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీల కోసం సుభాష్ పర్సనల్ గ్యారంటీ ఇచ్చారు. లోన్స్ తీర్చకపోవడంతో అప్పులిచ్చినవాళ్లు 2024లో పిటిషన్ వేశారు. విచారించిన ట్రిబ్యూనల్ ఈ తీర్పు ఇచ్చింది. ఇది చాలా తక్కువ మొత్తం అని అభ్యంతరపెట్టినా,‘బ్యాంక్‌రప్ట్‌సీలోకి పంపితే ఇంకా తక్కువ రావచ్చు’ అని ట్రిబ్యునల్ ఈ అమౌంట్‌ని ఫైనల్ చేసింది.

శనివారం ప్రత్యేకం..కలెక్టర్ ఆఫీసులో SC, ST దివ్యాంగుల కోసం!
Local· 27 Aug 2026

శనివారం ప్రత్యేకం..కలెక్టర్ ఆఫీసులో SC, ST దివ్యాంగుల కోసం!

గుంటూరు కలెక్టర్ CM.సాయికాంత్ వర్మ ఒక కొత్త మెసేజీ ఇచ్చారు. ఈ శనివారం (ఉదయం 10 గంటలకు) కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు.
ఎవరికి?
✅ దివ్యాంగులు
✅ ఎస్సీ, ఎస్టీలు
✅ ఉద్యోగులు
జిల్లా అధికారులంతా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగులు తమకున్న ప్రత్యేక సమస్యలను నేరుగా అధికారుల ముందుంచే సువర్ణ అవకాశమిది. ఉపయోగించుకోవాలి మరి.

ఫేక్ డాక్టర్లపై పోలీసుల ఫోకస్.. 12 మంది అరెస్ట్!
TG· 27 Aug 2026

ఫేక్ డాక్టర్లపై పోలీసుల ఫోకస్.. 12 మంది అరెస్ట్!

TG: ఫేక్ డాక్టర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. అర్హతలు, బేసిక్ హెల్త్ నాలెడ్జ్ లేకుండానే అసలైన డాక్టర్లలా నటిస్తూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్న 12 మందిని గుర్తించి యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ వల్ల ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. ఫేక్ డాక్టర్ల గురించి తెలిస్తే వెంటనే 112కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సజ్జనార్ కోరారు.

విశాఖలో సామాజిక శంఖారావం
Local· 27 Aug 2026

విశాఖలో సామాజిక శంఖారావం

AP: దళితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద KVPS, CITU, AIDWA, DYFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళిత కాలనీలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులుగా విశాఖ నగరంలోని వివిధ దళిత వాడల్లో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సర్వే నిర్వహించి అనేక సమస్యలను గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా దళిత కాలనీల్లో కుల వివక్ష కొనసాగుతుండటం దురదృష్టకరమని నాయకులు అన్నారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి
Local· 27 Aug 2026

అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి

మక్తల్ పట్టణానికి చెందిన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మక్తల్ ప్రాంతంలో విచ్చలవిడిగా టీ/కాఫీ దుకాణాలలో నడుస్తున్న బెల్టు షాపుల దందాను, అక్రమ గంజాయి రవాణా వంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళపై జరిగిన అత్యాచారానికి పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు
Local· 27 Aug 2026

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బ్రహ్మకుమారీలు కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

జలాల్‌పూర్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల
Local· 27 Aug 2026

జలాల్‌పూర్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో BLOల ఆధ్వర్యంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. గ్రామ సభలో జాబితాను ప్రజలకు చదివి వినిపించారు. అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే సవరణకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అంతా ఆంధ్ర పెత్తనమే నడుస్తోంది: కల్వకుంట్ల కవిత
TG· 27 Aug 2026

అంతా ఆంధ్ర పెత్తనమే నడుస్తోంది: కల్వకుంట్ల కవిత

TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పెత్తనమే నడుస్తోందని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి అసలేమీ మాట్లాడరని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. యాదాద్రి దేవస్థానం బోర్డులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నటుడి భార్యకు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. బీజేపీ సీఎం విదేశీ పర్యటనను అడ్డుకున్నప్పుడు మాత్రమే ఆయనకు తెలంగాణవాదం గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని అన్నారు.

నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు
National· 27 Aug 2026

నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు

నేపాల్–టిబెట్ బోర్డర్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. కైలాశ్ మానస సరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు మిస్ అయ్యారు. వరదల్లో దాదాపు 170 మంది మృతి చెందగా, 1,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఘటనపై సద్గురు కన్నీరుపెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి వెలదామనుకున్నా కుదరలేదని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు సద్గురు, తన టీమ్‌తో అక్కడికి వెళ్లేందుకు భారత్, చైనాల అనుమతి కోరుతున్నారు.

PRCని వెంటనే ప్రకటించాలి: TGEJAC
Local· 27 Aug 2026

PRCని వెంటనే ప్రకటించాలి: TGEJAC

TG: ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగ నేతలు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల బకాయిలను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

అర్హులందరూ ఓటర్ లిస్టులో ఉండాలి
Local· 27 Aug 2026

అర్హులందరూ ఓటర్ లిస్టులో ఉండాలి

TG: జగిత్యాల జిల్లా చిన్న మెట్‌పల్లిలో నిర్వహించిన గ్రామసభకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ జువ్వాడి నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో నమోదైన వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

వచ్చే ఒలింపిక్స్‌లో సత్తా చాటాలి: మోదీ
National· 27 Aug 2026

వచ్చే ఒలింపిక్స్‌లో సత్తా చాటాలి: మోదీ

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియా సంవాద్‌లో వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యువ అథ్లెట్లతో మాట్లాడారు. స్పోర్ట్స్ కేవలం మెడల్స్ కోసం కాదని, యువతలోని శక్తిని వెలికితీసే సాధనాలని అన్నారు. 5-15 ఏళ్ల పిల్లల్లో టాలెంట్‌ను గుర్తించి ఎంకరేజ్ చేయాలన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని మెడల్స్ సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ ఒలింపిక్స్‌లో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఆయన కోరారు.

పోలీసు అన్నలకు రాఖీ.. షాద్‌నగర్‌లో ప్రత్యేక వేడుక
Local· 27 Aug 2026

పోలీసు అన్నలకు రాఖీ.. షాద్‌నగర్‌లో ప్రత్యేక వేడుక

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలను నిర్వహించారు. తమను ఎల్లప్పుడూ సోదర భావంతో రక్షిస్తూ ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ ఆల్‌ సాయికుమార్‌తో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ సీఐ సీతారాం, ఎస్సైలు, కానిస్టేబుళ్లకు మహిళా విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

1,805 మంది ఓటర్లకు నోటీసులు
Local· 27 Aug 2026

1,805 మంది ఓటర్లకు నోటీసులు

TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ అసిస్టెంట్‌ రాథోడ్‌ విజయ మాట్లాడుతూ.. మొత్తం 1,805 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. నోటీసుల్లో ఉన్న వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సకాలంలో సవరణలు చేసుకోవాలని సూచించారు. మరో 165 మంది ఓటర్లకు 2002 ఓటర్‌ జాబితాలో సంబంధిత వివరాలు లేవని వెల్లడించారు. నోటీసులను బీఎల్‌వోలు సంబంధిత ఓటర్లకు పంపిణీ చేస్తారని తెలిపారు.

కల్వకుర్తిలో 2K రన్‌ను విజయవంతం చేయాలి
Local· 27 Aug 2026

కల్వకుర్తిలో 2K రన్‌ను విజయవంతం చేయాలి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 30న 2K రన్‌ నిర్వహించనున్నారు. “RUN – SAY NO TO DRUGS” నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి రన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని కోరారు.