Latest

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైర్ యాక్సిడెంట్‌లో 9మంది మృతి చెందగా, మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి పదిలక్షల చొప్పున అందిస్తామని స్పష్టంచేశారు.

లవ్‌మ్యారేజ్.. జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
TG : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన నవీన్ ఓ యువతిని గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ECIL ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులపెద్దల అనుమతి లేకుండా చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా సంఘానికి చెల్లించాలని సంఘం పెద్దలు తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించనందుకు తమను కుల బహిష్కరణ చేశారని నవీన్ తల్లిదండ్రులు డొంకెన్ మంజుల, నర్సింలు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ
TG: మృగశిర కార్తె సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండా వాసులు పెద్దఎత్తున కురవి పెద్దచెరువు వద్దకు తరలివచ్చారు. చెరువులో చేపల వేటకు దిగారు. భారీగా వలలు, గాలాలు వేసి చేపలను పట్టుకున్నారు. వలలు లేని వారు.. చీరలు, లుంగీలలో దొరికిన కాడికి చేపలను దోచుకున్నారు. విషయం సొసైటీ సభ్యులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. చెరువు వద్ద ఉంచిన 60బైక్‌లను, వలలు సీజ్ చేసి 14మందిని అరెస్ట్ చేశారు.

గుడ్‌న్యూస్.. ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ కోర్సులు
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఐటిడిఏ పరిధిలో ST యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులకు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ITDA అధికారులు తెలిపారు. కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, సోలార్ పంప్ టెక్నీషియన్, గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ వంటి కోర్సులను అందించనున్నారు. మూడనెలల పాటు నిర్వహించే ఈ కోర్సులు పూర్తిగా ఉచితంగా ఉండటమే కాకుండా హాస్టల్, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తిచేసిన ఎస్టీ అభ్యర్థులు అర్హులు.

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ
TG: మల్కాజిగిరి PS పరిధి మౌలాలి RTC కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వేఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్‌పై కన్నేసిన భార్య గంగాభాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా మర్డర్‌కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్‌కు విషాన్ని అన్నంలో కలిపి పెట్టడంతో మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా చేసి బకెట్‌లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో కోర్టు కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36)లకు ఉరిశిక్ష, గంగాభాయి(65)కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై నిర్లక్ష్యం: గుడివాడ అమర్‌నాథ్
AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి, ఉద్యోగులు మరణించిన ఘటనకు యాజమాన్యం వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వల్లే ప్లాంట్‌లో కార్మికుల భద్రత గాల్లో కలిసిపోతోందని చెప్పారు. తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పంటపొలాల్లో మొసలి పిల్లలు కలకలం
TG : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మిలిగిరిపేట గ్రామశివారులో మొసలి పిల్లలు కనిపించడం కలకలం రేపింది. పశువులను మేపుతున్న కాపరులకు సుమారు 20కిపైగా మొసలి పిల్లలు కనిపించడంతో కంగుతిన్నారు. గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మిలిగిరిపేట ప్రాజెక్టు పరిధిలోని వాగు సమీపంలో సుమారు 60కు పైగా మొసలి గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు మొసలి పిల్లలు, గుడ్లను సురక్షితంగా సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామంలోని అభయారణ్యానికి తరలించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. SMS-2, STC-3 హీట్ ఎఫ్ జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకైంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుంటే అది లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
AR రెహమాన్ మ్యాజిక్‌పై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్!
తన లేటెస్ట్ మూవీ 'పెద్ది' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై హీరో రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా సెకండ్ హాఫ్‌లో తాము ఎంతో కష్టపడి చేసిన సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుందో అని ముందు భయపడ్డామని ఆయన చెప్పారు. కానీ, ఆ సీన్స్‌ని AR రెహమాన్ తన మ్యూజిక్‌తో వేరే స్థాయికి తీసుకువెళ్లారని, అందుకూ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

కాక్రోచెస్ నెక్స్ట్ ప్రొటెస్ట్ ఎక్కడంటే?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మహారాష్ట్ర క్యాపిటల్ పుణేలో నిరసనకు కాక్రోచెస్ పార్టీ పిలుపునిచ్చారు. జూన్ 11న సాయంత్రం 4 గంటలకు 'సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ' లో ఈ ప్రొటెస్ట్ ఉంటుందని 'కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్' అనే సోషల్ మీడియా హ్యాండిల్ ల్లో అనౌన్స్ చేశారు.
మళ్లీ కొత్త జన్మ ఎత్తినట్టుంది : శ్రీజ ఎమోషనల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు అనుభవాల నుంచి ఎలా బయటకొచ్చారో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. బాధితురాలు అన్న ముద్ర నుంచి బయటపడడానికి 15 నెలల పాటు ఒక కోర్సు చేశానన్నారు. నాకే ఎందుకిలా జరిగింది ? నాకే ఎందుకింత బాధ ? మళ్లీ మళ్లీ నాకే ఎందుకిలా జరుగుతోంది ? ఇలాంటి ప్రశ్నలతో గతంలోనే నేను స్టక్ అయిపోయాను. నేను బాధితురాలిని అన్న ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఆ కోర్సు బాగా ఉపయోగపడిందని చెప్పారు. శ్రీజ వీడియోలో ఏం చెప్పారో మీరే చూడండి.
స్కూల్ ఫీజుతో పాటు 'పెద్ది' సినిమా ఫీజు కూడా పెట్టుకోండి!
మైత్రి రవి 'పెద్ది' మూవీ గురుంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "పేరెంట్స్ అందరికీ నాదొక రిక్వెస్ట్.. స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజులతో పాటు.. 'పెద్ది' సినిమా ఫీజు కూడా విడిగా పెట్టుకుని మీ పిల్లలకి ఈ సినిమా చూపించండి. వాళ్ళు చాలా ఇన్‌స్పైర్ అవుతారు" అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేరేడు పండ్లతో చాలా హెల్త్ బెనిఫిట్స్.. అస్సలు మిస్ అవ్వకండి!
సమ్మర్ లాస్ట్‌లో వచ్చే నేరేడు పండ్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఇవి బెస్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. రోజుకో ఐదు పండ్లు తింటే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీలోని వేస్ట్‌ని క్లీన్ చేసి, స్కిన్‌ను గ్లోయింగ్‌గా మార్చడంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం..
ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల అక్రమాలపై CJIకి లేఖ రాయడం, NEET ఎగ్జామ్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఇందులో ఉన్నాయి. అలాగే, కూటమి తదుపరి మీటింగ్‌ను ఆగస్టు 8న హైదరాబాద్‌లో పెట్టాలని డేట్ ఫిక్స్ చేశారు.

మమతకు మరో షాక్.. 20 మంది TMC MPలు NDAకి మద్దతు !
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటివరకు 58 ఎమ్మెల్యేలు ఆమెకి వ్యతిరేకంగా గళమెత్తితే ఇప్పుడు ఎంపీల వంతు వచ్చింది. షర్మిలా సర్కార్ నేతృత్వంలో సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఈ రెబెల్ ఎంపీలంతా కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వీరంతా ఒక కూటమిగా ఏర్పడి NDAకి మద్దతు ఇస్తూ లోక్ సభ స్పీకర్ కు లేఖ పంపారు. ఈ విషయాన్ని షర్మిళ NDTV చానెల్ కి చెప్పారు. ఈ పరిణామాలతో పార్టీ మరింత సంక్షోభంలో పడింది.

మ్యాన్‌హోల్‌లో ఇరుక్కున్న కాలు
TG : హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్దనున్న బస్‌స్టాప్ సమీపంలో పదేళ్ల బాలుడు కాలు మ్యాన్ హోల్‌లో ఇరుక్కుంది. స్థానికుల సమాచారం మేరకు డయల్-100 ద్వారా ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సైఫాబాద్ PS కానిస్టేబుల్ ప్రశాంత్ ఫైర్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా బాలుడిని సేఫ్‌గా బయటకు తీశారు. ఈ ఘటనలో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.
THE CLEAR CUT NEWS – TODAY HEADLINES
• పశ్చిమాసియా రణరంగం.. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు • ఏపీలోని కొన్ని జిల్లాల్లొ నేడు, రేపు వర్షాలు • ఫిలిప్పీన్స్‌లో 7.8 మాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం • పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! • రేవంత్ రెడ్డిపై ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు సెన్సేషనల్ కామెంట్స్!

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి
AP: విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మరణించారు. ఆయన మృతిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యావంతుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన తన జీవితాన్ని క్రైస్తవ సమాజ సేవకు అంకితం చేశారన్నారు. జయవాడ బిషప్‌గా, కడప బిషప్‌గా, ఏలూరు డయాసిస్ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్‌గా, శ్రీకాకుళం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన సేవలందించారన్నారు.

విరిగిన బస్ స్టీరింగ్ రాడ్.. just miss
AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు సమీపంలో RTC బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెద్ది' సినిమా పై గిరిజన సంఘాలు అభ్యంతరం!
'పెద్ది' సినిమాలో గిరిజనులను అవమానించేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయమై విజయనగరం కలెక్టర్, SP లకు ఆయా సంఘాల నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్స్ పెట్టినందుకు. సినిమా సెన్సార్ బోర్డ్‌తో పాటు 'పెద్ది' చిత్ర యూనిట్‌పై అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించిన HM సస్పెండ్
TG: చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించిన HMను అధికారులు సస్పెండ్ చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని శర్వాపురం MPPS ప్రధానోపాధ్యాయుడు బెక్కం వీరయ్యపై ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంపై కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు చండూరు ఆర్డీవో శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో వీరయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.