Latest
రేవంత్ రెడ్డిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సెన్సేషనల్ కామెంట్స్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు ఎవరు సలహాలు ఇస్తున్నారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. ఒక ప్రజాస్వామ్య నాయకుడికి హిట్లర్ ఇన్స్పిరేషన్ ఏంటని, చితిని (Death Pyre) క్రియేట్ చేసిన హిట్లర్ ఇన్స్పిరేషన్ ఏంటంటూ ఆయన ఫైర్ అయ్యారు. అసలు 'అస్సాసినేషన్' (హత్య) లాంటి పదాలను ఉపయోగించడమే చాలా ఘోరమైన విషయమని నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చిన్నారి మిస్సింగ్.. 72 గంటలుగా వీడని ఉత్కంఠ
AP: తండ్రి కోసం ఇంటి నుంచి వెళ్లిన రెండేళ్ల చిన్నారి శనివారం దారితప్పి అదృశ్యమైంది. కాకినాడ జిల్లా తుని మండలం రాజానగరం విలేజ్‌కు చెందిన సుంకర గణేష్, భవానీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గణేష్ మామిడితోటలో కాపలాదారుగా ఉంటున్నాడు. గణేష్ పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి తండ్రి కోసం తోటకు వెళ్తూ దారి తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రోన్, డాగ్‌స్క్వాడ్ సహాయంతో కొండ ప్రాంతాన్ని దాదాపు 500మంది పోలీసులు 72గంటలుగా జల్లెడ పట్టినా ఆచూకీ దొరకలేదు.

పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా (Mutual Consent) శారీరక సంబంధం పెట్టుకుంటే.. దాన్ని బట్టి ఒకరి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014 నాటి ఒక కేసును బేస్ చేసుకుని, క్యారెక్టర్ బాలేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఒక మహిళా కానిస్టేబుల్ జాబ్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈ కీలక తీర్పును ఇచ్చింది.

బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ బావిలో దూకి ఆత్మహత్య!
జగిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన రాహుల్, హైదరాబాద్‌లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. గత నెల 27న టూర్‌కు వెళ్తున్నానని చెప్పి సికింద్రాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఒంగోలు దగ్గరి సింగరాయకొండలో దిగి, అక్కడ ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. "నా కొడుకు కనిపిస్తే చెప్పండి" అంటూ కొద్దిరోజుల క్రితమే రాహుల్ తల్లి పెట్టిన వీడియో వైరల్ అయింది. కానీ, కాచిగూడ పోలీసులు విచారణ జరపడంతో రాహుల్ సూసైడ్ చేసుకున్న విషయం బయటపడింది.

సెలవులపై వచ్చిన ఆర్మీ ఉద్యోగి హత్య
TG: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. మెదక్ జిల్లా ర్యాలమడుగు విలేజ్‌కు చెందిన కుమార్ గౌడ్(49) ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా ఉత్తరాఖండ్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలతో మెదక్‌లో నివాసం ఉంటోంది. గతనెల 11న సెలవులపై ఇంటికి వచ్చిన కుమార్ గౌడ్, ఈ నెల 10న తిరిగి డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కొంతకాలంగా కుమార్ గౌడ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని పద్మ, తన కుటుంబసభ్యులతో కలిసి కర్రలతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సెల్‌ఫోన్ కలకలం
AP: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతా లోపం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు ఏకంగా సెల్‌ఫోన్‌తో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రావడం తీవ్ర కలకలం రేపింది. కంపార్ట్‌మెంట్లో ఉన్న సమయంలో తన మొబైల్‌తో వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నిషేధిత ప్రాంతంలో వీడియో తీయడంతో తిరుమల విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
CM విజయ్ చెస్ గేమ్ చూసి షాకైన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద!
తమిళనాడు CM విజయ్‌తో చెస్ ఆడటంపై గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. "CMతో చెస్ ఆడటం ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఆయనే స్వయంగా చెస్‌బోర్డ్ తెప్పించి నాతో గేమ్ ఆడారు. ఆయన అంత బాగా ఆడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిపై ఆయన్ని అడిగితే. ఫ్రెండ్స్‌తో కలిసి రెగ్యులర్‌గా చెస్ ఆడుతుంటానని చెప్పారు" అంటూ ప్రజ్ఞానంద హ్యాపీగా షేర్ చేసుకున్నాడు.

చనిపోయి పదిరోజులైనా ఎవరికీ తెలియదు
TG: నల్గొండ జిల్లా దేవరకొండలోని గాంధీనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు మరణించి పదిరోజులు గడిచినా ఎవరికీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించిన కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కుతినడంతో శరీరభాగాలు వేరైనట్లు డాక్టర్స్ నిర్ధారించారు. పదిరోజుల కిందే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నేరడుగొమ్ముకు చెందిన నాయిని రాజిరెడ్డి (80)గా గుర్తించారు. రాజిరెడ్డి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలియాల్సి ఉంది.

దెయ్యం వదిలిస్తామంటూ డబ్బులు వసూలు.. చివరికి
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట విలేజ్‌లో కేటుగాళ్ల గుట్టును గ్రామస్తులు రట్టు చేశారు. దెయ్యాలు-భూతాలు వదిలిస్తామంటూ బాబాల అవతారమెత్తి కొందరు భారీగా డబ్బులు దండుకుంటున్నారు. పూజల పేరుతో, దెయ్యాలను వదిలిస్తామంటూ గిరిజనుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ మోసాలను గమనించిన స్థానికులు ఏకమై వారిని నిలదీశారు.

అంబానీని దాటేసిన అదానీ!
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. $89.2 బిలియన్ల నెట్ వర్త్‌తో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ వెనక్కి నెట్టేశాడు. రీసెంట్‌గా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే నంబర్ 1 రిచెస్ట్ పర్సన్‌గా అదానీ నిలిచాడు. ప్రెజెంట్ ఈ బిగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారత్‌లో బర్త్ రేట్ పడిపోతోంది.."ఎలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
ఇండియాలో బర్త్ రేట్ తగ్గిపోవడంపై ఎలోన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు. ఇండియాలో బర్త్ రేట్ రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే చాలా కిందకు పడిపోయిందని మస్క్ చెప్పాడు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లలో ఈ రేట్ చాలా ఏళ్ల క్రితమే తగ్గిపోయిందంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

పవన్ కళ్యాణ్‌ని క్వశ్చన్ చేసిన జాతిరత్నాలు హీరో!
నటుడు రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పవన్ చూస్తున్న డిపార్ట్‌మెంట్స్‌లో RTI చట్టంలోని 'సెక్షన్ 4.1(b)' ప్రకారం సమాచారాన్ని బయటపెడుతున్నారా? అని ప్రశ్నించాడు. పెసా (PESA), 1/70 యాక్ట్ రిజల్ట్స్ చూపించాలన్నాడు. అలాగే అడవుల పెంపకం ప్రోగ్రామ్స్ నెంబర్స్ తేడాగా ఉన్నాయని ఇండిపెండెంట్ బాడీస్ చెప్తున్నాయన్నాడు. "నేను మీ ఫ్యాన్‌గానే అడుగుతున్నా, ప్రశ్నిస్తే దేశద్రోహిని కాదు" అంటూ రాహుల్ రాసుకొచ్చాడు.

గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన CM విజయ్!
నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన 'నార్వే చెస్ 2026' సిరీస్‌లో టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్‌గా ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా తమిళనాడు CM ఎస్. జోసెఫ్ విజయ్. ప్రజ్ఞానందను చీఫ్ సెక్రటేరియట్‌లో కలిసి స్పెషల్‌గా అభినందించారు. అంతేకాదు, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున రూ. 50 లక్షల చెక్కును బహుమతిగా ఇచ్చారు. ఈ మీటింగ్‌లో CM విజయ్, ప్రజ్ఞానందతో కలిసి సరదాగా కాసేపు చెస్ ఆడటం విశేషం! దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
స్కూల్‌లో ఒక్కసారిగా భారీ భూకంపం!
ఫిలిప్పీన్స్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో సోమవారం మార్నింగ్ ఫ్లాగ్ సెర్మనీ జరుగుతుండగా.. ఊహించని విధంగా 7.8 మాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం వచ్చింది. దాంతో స్టూడెంట్స్, టీచర్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళు భయంతో వణికిపోతున్న లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూకంపం దెబ్బకి స్కూల్ వెనుక ఉన్న ఒక బిల్డింగ్ కూడా కూలిపోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్కూల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు.

పరువు నష్టం కేసులో సన్ టీవీ పై నటి సుకన్య గెలుపు !
1996లో అడవి దొంగ వీరప్పన్ ఇంటర్వ్యూలో తనపై అసత్య వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు నటి సుకన్య వేసిన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాస్తవాలు సరిచూడకుండా, ఆ భాగాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేసినందుకు సుకన్యకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సన్ టీవీ నెట్‌వర్క్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె 30 ఏళ్ల న్యాయపోరాటం ముగిసింది.

చంద్రుడిపై ప్రయోగాలకు రేపు మరో టీమ్ రెడీ !
చంద్రుడిపై శాశ్వత నివాసమే లక్ష్యంగా నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆర్టెమిస్-3' మిషన్ కీలక దశకు చేరింది. ఈ చారిత్రాత్మక ప్రయోగంలో పాల్గొనే నలుగురు ఆస్ట్రోనాట్ల పేర్లను రేపు రాత్రి 8:30 గంటలకు (IST) నాసా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది.. 'ఆర్టెమిస్-2' విజయవంతం కావడంతో నాసా ముందుకు ప్రొసీడ్ అవుతోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో సాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలిసారి ఒక మహిళను, శ్వేతజాతీయేతరుడిని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించనున్నారు. ఈ మిషన్ భవిష్యత్తులో మార్స్ యాత్రకు పునాది లాంటిదే.

ఏపీలో పలు జిల్లాల్లొ నేడు, రేపు వర్షాలు !
కర్ణాటక నుంచి కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు పడతాయి. ఏపీలోని పలు జిల్లాల్లొ రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించింది.

అక్కడ ఆయాలే డాక్టర్స్.. ఎందుకంటే..?
TG: డాక్టర్ల కొరతతో HYD నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా వైద్యులు లేకపోవడంతో ఆయాలే రోగులకు సెలైన్లు పెడుతున్నారు. మందులు వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఆయాలు రోజువారీ అనుభవంతో తోచిన వైద్యసేవలు అందిస్తున్నారని, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రోగులు టెన్షన్ పడుతున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో మొత్తం 52మంది నర్సింగ్ సిబ్బంది ఉండగా 2024లో 22మంది స్టాఫ్‌నర్సులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా భర్తీ కాలేదు. దీంతో అన్నీపనులు ఆయాలే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నా దారి నాదేనంటున్న శ్రేయస్ అయ్యర్
టీమిండియా T20 కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ గట్టి స్టేట్‌మెంట్ ఇచ్చాడు! సూర్యకుమార్ ఫామ్ దెబ్బతినడంతో లక్ తిరిగిన అయ్యర్, తాను ఎవరి "షాడో"లోనూ ఉండనని క్లియర్ చేశాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో పనిచేయబోతున్నా, కెప్టెన్సీ కోసం తన పర్సనాలిటీ మార్చుకోనని హింట్ ఇచ్చాడు. IPL సక్సెస్‌తో వచ్చిన ఈ ఛాలెంజ్‌ను తన ఓన్ స్టైల్‌లోనే హ్యాండిల్ చేస్తానంటూ BCCIకి సిగ్నల్స్ ఇచ్చేసాడు!

యాంకర్ ని స్టుపిడ్ అంటూ ట్రంప్ వీరంగం !
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన అసహనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.కాలిఫోర్నియా ఎలక్షన్ రిగ్గింగ్ వివాదంపై NBC 'మీట్ ది ప్రెస్' యాంకర్ క్రిస్టెన్ వెల్కర్.. ట్రంప్‌ను గట్టిఆధారాలు అడిగింది. అంతే, సీన్ హీటెక్కింది! "నేను జస్ట్ చూస్తే చాలు" అంటూ ట్రంప్ కవర్ చేశారు. యాంకర్ వదలకుండా నిలదీయడంతో, "నువ్వు క్రుకెడ్ లేదా స్టుపిడ్" అని ఫైర్ అయి, "ఐవ్ హాడ్ ఎనఫ్.. థాంక్యూ డార్లింగ్" అంటూ మైక్ కిందపడేసి ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసేశారు!

'మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి'
TG: గాలివాన బీభత్సానికి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకటరావుపల్లి విలేజ్‌లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గ్రామంలో తోట శాంతమ్మ, పూదరి అంజయ్య ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెలిశాల లక్ష్మీపతి పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. సాదక్ నిషా ఇల్లు గాలివానకు దెబ్బతింది. పలువురు ఇళ్లు కూడా వర్ష బీభత్సానికి పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు.