Latest

‘టాక్సిక్’ రివ్యూ: యష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కేనా?
ఈరోజు యష్ ‘Toxic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ స్వాతంత్ర్యం తర్వాతి గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ రాయా(యష్) తన పవర్, డబ్బుతో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అదే టైమ్‌లో ఫామిలీ, ప్రేమ, నమ్మకం, అతని జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. యష్ డ్యూయల్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. యాక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మూవీకు హైలైట్. అయితే స్టోరీ కొన్ని చోట్ల స్లోగా, Confusingగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది కథ కంటే స్టైల్, యాక్షన్‌పై ఎక్కువగా డిపెండ్ అయిన సినిమా.

వరుస బంగారు చోరీ కేసులు ఛేదింపు.. నిందితుడి అరెస్ట్
AP: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం రూరల్ పోలీసులు బంగారు ఆభరణాల చోరీ కేసులను ఛేదించారు. సోంపేట మండలం ఇసుకలపాలెంకు చెందిన వాసుపల్లి తాతారావును అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.39 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.28.43 లక్షలు కాగా, నగదుతో కలిపి మొత్తం రికవరీ విలువ రూ.28.82 లక్షలుగా ఉందని కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని తెలిపారు. ఇచ్చాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఏడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.

CJPలో కీలక అపాయింట్‌మెంట్స్.. కొత్త టీమ్ రెడీ
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన ఆర్గనైజేషన్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉంది. పార్టీ కొత్తగా కీలక నియామకాలు చేసింది. రేఖా శర్మ, అక్షయ్ షిండే, ప్రేమ్ ఆకాశ్, అనమ్ ఉజ్జమా, బాలకృష్ణ శుక్లాలను ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీలుగా అపాయింట్ చేసింది. సుధీర్ సంగ్వాన్, సిద్ధాంత్ భరద్వాజ్‌లను నేషనల్ స్పోక్స్‌పర్సన్‌లుగా ప్రకటించింది. నార్త్, వెస్ట్, ఈస్ట్ జోన్లకు కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రౌండ్ లెవల్‌లో పార్టీని మరింత యాక్టివ్‌గా చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేస్తున్నట్లు CJP తెలిపింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్రం కీలక ఆదేశాలు
AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మొత్తం CISF బలగాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మూడునెలల నోటీసు వ్యవధి అనంతరం 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలోని CISF సిబ్బందిని వెనక్కి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్లాంట్‌లో భద్రతా విభాగంలో 1,033 మంది, అగ్నిమాపక విభాగంలో 298 మంది CISF సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉపసంహరణకు ముందు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి CISFకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.

తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు యూటర్న్ తీసుకుని కాస్త తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.1,50,090గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,64,900గా నమోదైంది. అయితే గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
AP: కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయడంతో పాటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమలు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ పోర్టల్ సక్రమంగా పనిచేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లేబర్ కార్డుల జారీ, రెన్యువల్స్ నిలిచిపోయాయని తెలిపారు.

ఇద్దరి లేడీ కానిస్టేబుళ్ల సాడ్ లవ్ స్టోరీ?
పుణేలోని పింప్రీ-చించ్వాడ్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా ఉన్న ఇద్దరు మహిళలు ప్రేమలో పడి, ఆగస్టు 30న వేద పద్ధతిలో మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. లీవ్ అప్లై చేసి, అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. అయితే ఒకరి ఫ్యామిలీ తీవ్రంగా అభ్యంతరం చెప్తూ సీనియర్ ఆఫీసర్లను కలవగా, ఇది వారి పర్సనల్ మ్యాటర్ అని, కౌన్సెలింగ్ మాత్రమే ఇస్తామని పోలీసులు చెప్పారు. ఈ వివాదాల వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఇండియాలో సేమ్-సెక్స్ రిలేషన్‌షిప్‌కు లీగల్ పర్మిషన్ ఉన్నా, మ్యారేజెస్‌కు ఇంకా లీగల్ రికగ్నిషన్ లేదు.

కారులో 129 కిలోల గంజాయి.. ఇద్దరి అరెస్ట్
TG: వరంగల్‌లో నార్కోటిక్స్ పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. వర్ధన్నపేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రూ.64.66 లక్షల విలువైన 129 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం 5.50 గంటల సమయంలో ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా, వెనుక భాగంలో అక్రమంగా దాచిన 61 ప్యాకెట్ల గంజాయి గుర్తించారు. అరెస్టయిన వారిని కేరళకు చెందిన సయూజ్ సి.ఎస్ (33), బెసలేల్ సి. మాథ్యూ (38)గా గుర్తించారు.

‘Toxic’ టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ ఓకే
TG: ‘టాక్సిక్’ సినిమా టికెట్ రేట్లు పెంపుకు తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖ అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ప్రొడక్షన్ సంస్థ KVN మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రూ.50, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ పెంపు GSTతో కలిపి ఉంటుంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పరిగిన ధరలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు.

వీల్‌చైర్ లేక రోగిని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి
TG: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన ఓ రోగిని ఎక్స్‌రేకు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు అతడిని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో వసతుల పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన సంఖ్యలో వీల్‌చైర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజూ రోగులు ఇబ్బందులు పడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటరు జాబితాలపై 27న గ్రామ సభలు, వార్డు సభలు
TG: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఓటరు జాబితాల్లో పేర్లు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత తప్పనిసరిగా ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైతే ఫారం-8ను వినియోగించుకోవచ్చన్నారు.

పాకాలలో అరుదైన చేపల డేగ దర్శనం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల బయోడైవర్సిటీ పార్కులో అరుదైన గ్రే హెడ్డెడ్ ఫిష్ ఈగిల్ (చేపల డేగ) సందడి చేసింది. బూడిదరంగు తల, మెడ, ముదురు గోధుమరంగు రెక్కలు, తెల్లటి దిగువ భాగంతో కనిపించిన ఈ అరుదైన పక్షి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా నీటి వనరుల పరిసర ప్రాంతాల్లో సంచరించే ఈగిల్ పాకాల అటవీ ప్రాంతంలో దర్శనమివ్వడం ఇక్కడి జీవ వైవిధ్యానికి నిదర్శనమని ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ తెలిపారు. ఎకో టూరిజం వాచర్ జయప్రకాష్ ఈ పక్షిని తన కెమెరాలో అందంగా బంధించారు.

అత్యాచారం కేసు ఖైదీకి పదే పదే బెయిల్స్: వివాదంలో ప్రభుత్వం!
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా గవర్నమెంట్ ఆగస్టు 25న 21 రోజుల ఫర్లాఫ్ మంజూరు చేసింది. 2017లో జైలుకి వెళ్లాక ఆయన బయటకు రావడం ఇది 17వ సారి. ఈ ఇయర్ లోనే జనవరి, మే తర్వాత ఇది థర్డ్ టైమ్ కావడం, ఇప్పటివరకు 435 రోజులకు పైగా బయటే గడపడం హాట్ టాపిక్‌గా మారింది. రోహ్‌తక్ సునారియా జైలు నుంచి విడుదలైన ఆయన సిర్సాలోని డేరా హెడ్ ఆఫీసులో ఉండనున్నారు. ఈ ఫ్రీక్వెంట్ రిలీజ్, VIP ట్రీట్‌మెంట్‌పై ఆపోజిషన్ లీడర్స్, యాక్టివిస్ట్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ట్రావెల్ బస్సు-కంటైనర్ ఢీ.. ఆరుగురు మృతి
TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు (Fresh Bus) కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఆ టైమ్‌లో బస్సులో 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు రక్షించి కోదాడ Govt. హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు డ్రైవర్, క్లినర్‌పై కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ద్వారకుంట ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
TG: సూర్యాపేట: కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బాలకృష్ణ చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం
AP: సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో చిలమత్తూరు బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రూ.7.5 లక్షలతో నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. పైప్‌లైన్ పనులు పూర్తయితే కాలనీవాసులకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారానికి నిధులు మంజూరుపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఫరూఖ్‌నగర్‌లో నేడు బ్లడ్ డొనేషన్ క్యాంప్
TG: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ & యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఆగస్టు 26న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ వాటర్ ట్యాంక్ వద్ద శిబిరం జరగనుంది. ‘బీ ఎ హీరో.. డొనేట్ బ్లడ్, సేవ్ లైవ్స్’ అనే సందేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు
TG: హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఇటీవల ఏడంతస్తుల అపార్ట్‌మెంట్ కూల్చివేత ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), హైడ్రా అధికారులు అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి వరుస కూల్చివేతలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న అక్రమ భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలను ముమ్మరం చేశారు.

పాడేరులో టెట్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళన
AP: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించే నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పాడేరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కె. రఘునాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి. మహేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను సవరించి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు.
పాటలతో 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్': TG టీచర్‌కి నేషనల్ అవార్డ్!
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాల టీచర్ బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది నేషనల్ టీచర్స్ అవార్డుకు ఎంపికైన ఏకైక తెలంగాణ టీచర్ ఈమెనే. చిన్న పిల్లలకు 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి అవగాహన కల్పిస్తూ.. రైమ్స్, పాటలు, డ్యాన్స్ అండ్ మైండ్ గేమ్స్‌తో డిఫరెంట్‌గా పాఠాలు చెప్తూ స్కూల్ అడ్మిషన్లను భారీగా పెంచారామె. సోషల్ మీడియాలోనూ ఈమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. AP నుంచి కౌలూరి రాజేశ్ కూడా ఈ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు.

5 నుంచి 9వ తరగతి సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
AP: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీసీవో సుధాకృష్ణ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల గురుకుల పాఠశాలల్లో ఖాళీలను కమ్యూనిటీ, కుల నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన బాలికలు ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మడికొండలోని బాలికల గురుకుల పాఠశాలకు హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.