Latest

చట్టసభల్లో Gen Z ప్రాతినిధ్యం నామమాత్రం?
భారత జనాభాలో 25.8% (36.74 కోట్లు) ఉన్న GenZ (1997-2012) ప్రాతినిధ్యం చట్టసభల్లో చాలా తక్కువగా ఉంది. పోటీకి ఏజ్ లిమిట్ 25ఏళ్లు కావడంతో దేశవ్యాప్తంగా కేవలం 26మంది (6MPs, 20MLAs) మాత్రమే గెలిచారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కి 3, SPకి 2, LJPకి 1 MP ఉన్నారు. అయితే 6MPలలో 5మంది, 20MLAలలో 8మంది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. సింగర్ మైథిలి, డాక్టర్ జైశంకర్ లాంటి కొందరే స్వశక్తితో గెలిచారు. ఏజ్ లిమిట్ రూల్ వల్లే యంగ్ లీడర్లు రాజకీయాలకు దూరమవుతున్నారు, 2029కి GenZనే బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ కాబోతోంది.

తాగునీటి కోసం చెరువులు నింపనున్న అధికారులు
AP: ఐదు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జవహర్ కాలువ (NSJC)కు 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఆగస్టు 26న నీటి విడుదల ప్రారంభం కానుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 442 తాగునీటి చెరువులను ఈ నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాగునీటి కోసం విడుదల చేసిన నీటిని పంటలకు మళ్లించడం లేదా అక్రమంగా తోడటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాలువ పరిధిలో అక్రమ మోటార్లు, పంపుల వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.

జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి
TG: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని SFI, AISA డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలో 8 కోర్సుల్లో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవన్నారు. దీంతో చెట్ల కింద, తరగతి గదుల బయట కూర్చుని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌ఐవీ నివారణకు బాధ్యతగా ముందుకు రావాలి
TG: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని ఐసీటీసీ కౌన్సిలర్ ఎం. హనుమంతరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ‘ఐఈసీ క్యాంపెయిన్–2026’ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు.

తపాలా శాఖలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు
AP: విదేశాల నుంచి నగదు పంపిణీ చేసుకునే వారికి తపాలా శాఖలో అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని కోనసీమ జిల్లాలోని అమలాపురం డివిజన్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ చెరుకూరి శ్రీనివాస్ తెలిపారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రియామి ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

US వీసా బిగ్ షాక్: అపాయింట్‌మెంట్స్ అన్ని రద్దు!
ట్రంప్ సెకండ్ టైమ్ పవర్‌లోకి వచ్చాక ఇమ్మిగ్రేషన్ రూల్స్ విషయంలో షాకింగ్ desicions తీసుకుంటున్నారు. రీసెంట్గా అమెరికా గవర్నమెంట్ వరల్డ్ వైడ్‌గా వీసా అపాయింట్‌మెంట్లను సడన్‌గా స్టాప్ చేసింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన కొన్ని ఇంటర్వ్యూలను కూడా క్యాన్సిల్ చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. అయితే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఎంబసీలు, కాన్సులేట్లలో స్టాఫ్‌కి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోందని, అందుకే వీసా అపాయింట్‌మెంట్స్ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది.
మంచంపై పడుకున్నావని అడిగినందుకు కిరాతక హత్య
AP: మంచంపై ఎందుకు పడుకున్నావని అడిగినందుకు 90 ఏళ్ల వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనలో నిందితుడు సజీవ్ కుమార్‌ను కలిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో మూడు రోజుల క్రితం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధుడు రామిరెడ్డి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన సజీవ్ కుమార్ కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం కలిగిరి సీఐ సుబ్బారావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పవన్ బర్త్‌డే వేడుకల్లో నిబంధనలు పాటించాలి
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అభిమానులు వ్యవహరించాలని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్ సూచించారు. కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలపై వివాదాస్పద లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే రాతలు రాయవద్దని సూచించారు.

మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా నౌసిలాల్ నాయక్
TG: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పీఏసీఎస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంఘం అభివృద్ధికి, రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తానని నౌసిలాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను నాయకులు అభినందించారు.

27న మినీ ఉద్యోగ మేళా
AP: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న (గురువారం) కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలను పొందాలని సూచించారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ మాట్లాడుతూ మినీ జాబ్ మేళాలో నాలుగు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు.

₹3.4 లక్షల కోట్ల అదనపు ఖర్చా? 😳
ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక బడ్జెట్.. పూర్తయ్యేసరికి ఇంకో బడ్జెట్! అసలు ఈ ఖర్చు ఎందుకు పెరుగుతోంది? తాజా MoSPI రిపోర్ట్ ప్రకారం ₹150 కోట్లకు పైబడిన 1,775 కేంద్ర ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అసలు అంచనా వ్యయం ₹33.70 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడు రివైజ్డ్ కాస్ట్ ₹37.11 లక్షల కోట్లకు చేరింది. అంటే ₹3,40,504 కోట్ల అదనపు భారం. అయితే ఏ ప్రాజెక్టుల్లో ఎంత ఓవర్‌రన్ వచ్చిందో, దానికి ఖచ్చితమైన కారణాల వివరాలను ఈ రిపోర్ట్ చెప్పలేదు. ఇప్పటికే ₹19.26 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. అదనపు ఖర్చు ఎందుకు పెరిగిందన్నదే ప్రశ్న.

కాల్పుల ఘటనపై భువనగిరిలో కాంగ్రెస్ ఆందోళన
TG: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటనను ఖండిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలో భువనగిరిలో నిరసన నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంగ ప్రవీణ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై కాల్పులు జరపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలన్నారు.

ఆలమూరులో తొలి పోలీస్ పెట్రోల్ బంక్ ప్రారంభం
AP: పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకుల్లో కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రజలు ఈ బంకుల్లోనే పెట్రోల్ కొనుగోలు చేసి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఆగ్రహం
TG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి సరికాదని మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునాథ రాజు విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలేరులో బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై మల్లన్న పోటీకి సిద్ధపడటం సమంజసం కాదన్నారు. సొంత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపైనే పోటీ చేయడం ద్వారా బీసీల మధ్య ఐక్యతను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: AISA
AP: విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని AISA నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అశోక్, సూర్య, రామ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపై AISA నిరంతరం పోరాడుతోందని తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

మిలాద్ ఉన్ నబీ పండుగ వేళ పటిష్ట బందోబస్తు
AP: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌లో విషపూరిత విత్తనాలు అమ్మారా? 😳
ఆన్‌లైన్‌లో దొరికే ప్రతి వస్తువూ తినడానికి సేఫ్ అనుకోవద్దు! కర్ణాటకలో ధతూరా పండ్లు, విత్తనాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో మానవ వినియోగానికి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో Amazon, Swiggy Instamart, BigBasket వంటి ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకున్నారు. ధతూరా మొక్కలోని కొన్ని భాగాల్లో విషపూరిత పదార్థాలు ఉంటాయి. వాటిని పొరపాటున తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆన్‌లైన్‌లో కనిపించినంత మాత్రాన ఏ వస్తువునైనా ఆహారంగా తీసుకోవద్దని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ఆశావర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి: MLA సంజయ్
TG: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాకు కోరుట్ల MLA సంజయ్ మద్దతుగా నిలిచారు. హైదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ఆశావర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

8 లక్షల మంది యువతతో PM Modi
రేపు దేశవ్యాప్తంగా లక్షలాది యువత ఒకే వేదికపైకి రానున్నారు. ఆగస్టు 27న జరిగే ‘ఖేలో ఇండియా సంవాద్’లో ప్రధాని మోదీ సుమారు 8 లక్షల మంది యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. యువతను క్రీడలతో పాటు దేశ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం చేయడంపై ఈ కార్యక్రమం ఫోకస్ పెట్టనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత పాల్గొనడంతో వారి ఆలోచనలు, ఆసక్తులు, ఆశయాలకు ఈ వేదిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇంతమంది యువతతో ఒకేసారి మాట్లాడనున్న ప్రధాని ఏ అంశాలపై ఫోకస్ చేస్తారు? ఎలాంటి సందేశం ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

పాము కనిపిస్తే.. ఇక ఫోన్‌లోనే Rescue Help!
ఇంట్లో ఒక్కసారిగా పాము కనిపిస్తే, భయంతో దాన్ని పట్టుకోవాలని లేదా చంపాలని ప్రయత్నించడం ప్రమాదమే. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపేందుకు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ‘SHIVAA’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో దగ్గర్లో ఉన్న రిజిస్టర్డ్ స్నేక్ రెస్క్యూయర్‌ను సంప్రదించే అవకాశం ఉంటుంది. పాముకాటు జరిగితే ఫస్ట్ ఎయిడ్ సూచనలు, యాంటీ-స్నేక్ వెనం అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ సమాచారం కూడా లభిస్తుంది. అక్టోబర్ 2–8 మధ్య వైల్డ్‌లైఫ్ వీక్‌లో దీనిని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రజాసమస్యలపై కమిటీలు చొరవ చూపాలి: గుత్తా
TG: ప్రజా సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో శాసన కమిటీలు కీలకపాత్ర పోషించాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. శాసనమండలి సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వెనకబడిన తరగతుల సంక్షేమం, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కమిటీలు పర్యవేక్షించాలని అన్నారు.