కాలేజీమేట్స్.. ఇప్పుడు ఒకే అసెంబ్లీలో
తమిళనాడు సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్లిద్దరూ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఇద్దరూ ప్రత్యర్థులు. స్పీకర్ గా ఎన్నికైన టీవీకే నేత జేసీడీ ప్రభాకర్ కూడా వీళ్ల కాలేజీయే. వీరంతా లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు. ఇదే విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ ఇవాళ అసెంబ్లీలో గుర్తు చేశారు. ఒకే కాలేజీలో చదివినా పాలిటిక్స్ లో మేమే సీనియర్స్ అంటూ నవ్వులు పూయించారు.



