గవర్నర్ ని కలిసిన విజయ్… కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం

టీవీకే అధినేత విజయ్ ఇవాళ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలుసుకున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. బలనిరూపణకు 15 రోజులు గడువు అడిగారు. కాంగ్రెస్ తో టీవీకే పొత్తు ఇప్పటికే ఖరారైంది. మరో అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. మరోవైపు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా లెఫ్ట్ పార్టీల మద్దతు విజయ్ కోరారు. ఇంకా ఎవరెవరు విజయ్ కి కలిసివస్తారో చూడాలి.



