తమిళనాడు కింగ్ విజయ్.. పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారం దిశగా

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో పెను సంచలనం సృష్టిస్తున్నారు. ఫిబ్రవరి 2, 2024న పార్టీ స్థాపించిన విజయ్, కేవలం రెండేళ్లలోనే తన పార్టీని అధికారానికి చేరువగా తీసుకెళ్లారు. 104 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్స్ లో ఉన్నారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్‌తో రాజకీయాల్లో రాణిస్తున్నది విజయే. యూత్, ఫస్ట్ టైమ్, ఓటర్లు, మహిళలు విజయ్ పార్టీ వైపే ఉన్నారు. పార్టీలకతీతంగా ఫ్యాన్స్ బేస్ ని తన వైపు తిప్పుకోవడంలో విజయ్ సక్సెస్ కొట్టారు.


