← Back to news

బెంగాల్ లో మమతని దెబ్బ తీసిన మహిళా ఓటర్లు

By aravinda nyayapati· 4 May 2026· Kolkata
బెంగాల్ లో మమతని దెబ్బ తీసిన మహిళా ఓటర్లు

WBలో మమత బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. దీంతో అధికార వ్యతిరేత బాగా పని చేసింది. మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం మహిళా ఓటర్లు. దీన్ని దెబ్బతీయడానికి బీజేపీ భారీ హామీలను ఇచ్చింది. ప్రస్తుతం టీఎంసీ మహిళలకి నెలకి 1500 సాయం అందిస్తూ ఉంటే బీజేపీ ప్రతీ నెల 3 వేలు డైరెక్ట్ ట్రాన్సఫర్ చేస్తామని హామీ ఇచ్చింది. గర్భిణీ స్త్రీలకు ₹21,000 ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ , మండలానికో పోలీసు స్టేషన్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, 75 లక్షల మంది మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ లక్ష్మీపతి దీదీలుగా తీర్చిదిద్దుతామన్న హామీలు మహిళలంతా బీజేపీ వైపు నడిచేలా చేశాయి.

More in Politics