బెంగాల్ ఎన్నికల ఫలితాల్ని మార్చేసిన “సర్”

బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ SIR ఫలితాల్ని మార్చేసింది. మొత్తం ఓట్లలో ఏకంగా 12% అంటే 90.66 లక్షల ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్‌లో 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ఈ ప్రక్రియ ముగిసేసరికి 6.75 కోట్లకు పడిపోయింది. 2021 ఎన్నికల్లో TMC, BJP మధ్య ఉన్న ఓట్ల తేడా సుమారు 10%. దాని కంటే ఎక్కువ శాతం ఓట్లే జాబితా నుంచి తొలగించారు. దీని ఎఫెక్ట్ 140 నియోజకవర్గాల్లో పడింది. ఈ ఓట్లన్నీ దొంగ ఓట్లు అని బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లు తొలగించామని బీజేపీ చేసిన ప్రచారం బాగా పని చేసింది.


