ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం !

పర్షియన్ గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఇప్పటి వరకూ జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలను దాటుకుని ఇరాన్ జెట్ విమానాలు కీలక స్థావరాలను ధ్వంసం చేయడం గమనార్హం. గతంలో ప్రకటించిన దానికంటే వాస్తవ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అమెరికా అత్యాధునిక పరికరాలు సమకూర్చుకున్నా.. అవన్నీ ఒక్క ఇరాన్ జెట్ దెబ్బకే తుక్కు తుక్కుఅయిపోవడం ఆశ్చర్యంకలిగిస్తోంది.
