Latest

కేంద్రంలో 8.23 లక్షల జాబ్స్..మొత్తం ఖాళీ!
Current Affairs· 25 Aug 2026

కేంద్రంలో 8.23 లక్షల జాబ్స్..మొత్తం ఖాళీ!

సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇప్పుడు 8.23 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ మంజూరైనా రిక్రూట్‌మెంట్ మాత్రం జరగడం లేదు. రైల్వేలు, డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ.. అన్నింటిలోనూ ఈ ఖాళీలున్నాయి. రైల్వేలు: 2.40 లక్షల ఖాళీలు, డిఫెన్స్ (సివిలియన్): 2.41 లక్షలు, హోమ్ మినిస్ట్రీ: 61,546, రెవెన్యూ: 69,652, కామర్స్: 2,435 ఖాళీలు. 2015తో పోలిస్తే కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఖాళీలు పెరిగాయి, కొన్నిట్లో తగ్గాయి. కానీ ఓవరాల్ సీన్ ఏంటంటే… జాబ్ మార్కెట్ టైట్‌గానే ఉంది.

రూ.1కే AC ఫంక్షన్ హాల్..ఎక్కడంటే!
AP· 25 Aug 2026

రూ.1కే AC ఫంక్షన్ హాల్..ఎక్కడంటే!

AP: నెల్లూరులో పేద, మధ్యతరగతి ప్రజల కోసం మున్సిపల్ కార్పొరేషన్ కేవలం రూపాయికే సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి నారాయణ దీన్ని ప్రారంభించారు. రూ.1.40 కోట్ల వ్యక్షంతో నిర్మించిన ఈ హాల్‌లో ఐదువేల మంది కూర్చోవచ్చు. ఎన్‌క్యాప్ నిధులు రూ. 25 లక్షలు, కార్పొరేషన్ నిధులు రూ.1.15 కోట్లతో దీన్ని నిర్మించారు.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్..
National· 25 Aug 2026

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్..

కొద్ది రోజులుగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్‌కి మంగళవారం బ్రేక్ పడింది. ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.200 పెరిగి రూ.1,50,100 గా నమోదైంది. మార్కెట్లో రేట్లు ఎప్పడికప్పుడు మారే అవకాశం ఉన్నందున కొనే ముందు చెక్ చేసుకోండి.

ప్రిన్స్‌ సెసిల్‌ పెళ్లి.. న్యూజిలాండ్‌లో ఘనంగా వేడుక
Entertainment· 25 Aug 2026

ప్రిన్స్‌ సెసిల్‌ పెళ్లి.. న్యూజిలాండ్‌లో ఘనంగా వేడుక

టాలీవుడ్‌ యాక్టర్‌ ప్రిన్స్‌ సెసిల్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సాయి మాచిరాజును ఆయన న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. నిన్న ఉదయం జరిగిన ఈ వేడుకకు ఫామిలీ మెంబెర్స్, దగ్గరి చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. ప్రిన్స్‌ ఐవరీ కుర్తా, వెష్టి ధరించగా.. సాయి ఎరుపు రంగు పట్టుచీర, బంగారు ఆభరణాలతో మెరిశారు. వీరిద్దరూ 2025 సెప్టెంబర్‌లో ఓ ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ తరువాత జూన్‌లో హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ షాపులు
Local· 25 Aug 2026

పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ షాపులు

AP: గ్రామాల్లో అక్రమ బెల్ట్‌ షాపులు పెరిగి పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామాల ప్రజలు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండటంతో యువత, కూలీలు, పేదలు మద్యానికి బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో గొడవలు పెరగడంతో మహిళలు, విద్యార్థులు రోడ్లపై వెళ్లేందుకు భయపడుతున్నారు. పోలీసు, ఆబ్కారీ శాఖ అధికారులు అక్రమ దుకాణాలను సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

చిన్నారుల మిస్సింగ్.. గంటల్లోనే కాపాడిన పోలీసులు
Local· 25 Aug 2026

చిన్నారుల మిస్సింగ్.. గంటల్లోనే కాపాడిన పోలీసులు

TG: HYD నగరం గచ్చిబౌలిలో మిస్ అయిన ఇద్దరు చిన్నారుల్ని పోలీసులు గంటల వ్యవధిలోనే కనిపెట్టారు. ​రాఘవ ప్రాజెక్ట్ లేబర్ క్యాంప్‌కు చెందిన ప్రమీలా ముర్ము(4), సంగీత (3) చిన్నారులను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి చాకు సోరెన్ అనే వ్యక్తి బయటకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు.

Expired చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
Viral· 25 Aug 2026

Expired చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో Expired చాక్లెట్ల కోసం జనం ఎగబడ్డారు. పంకీ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని డంపింగ్‌ సైట్‌ వద్ద చాక్లెట్లు, టాఫీలను పడేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బ్యాగులు, బస్తాలు, డబ్బాల్లో చాక్లెట్లను నింపుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Expired ఫుడ్ ప్రొడక్ట్స్‌ను అలా తీసుకెళ్లడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మనమిత్రలో 1,204 సేవలు.. డేటా ఇంటిగ్రేషన్‌కు CM ఓకే
AP· 25 Aug 2026

మనమిత్రలో 1,204 సేవలు.. డేటా ఇంటిగ్రేషన్‌కు CM ఓకే

AP: AI అసిస్టెంట్‌, DG వెరిఫై, డేటా లేక్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వంటి మోడ్రన్ టెక్నాలజీను వాడాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను మరింత ఈజీ చేయాలని అన్నారు. ప్రజలు Govt. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ ‘మనమిత్ర’ ద్వారా అందుతున్న 1,204 సేవల్లో డేటా ఎంట్రీని మరింత సింప్లిఫై చేయాలని సూచించారు. సర్టిఫికేట్స్ అప్‌లోడ్‌ అవసరం లేకుండా డేటా ఇంటిగ్రేషన్‌ చేయాలని స్పష్టం చేశారు.

నిజమాబాద్‌లో నేడు గవర్నర్ పర్యటన
Local· 25 Aug 2026

నిజమాబాద్‌లో నేడు గవర్నర్ పర్యటన

TG: నిజామాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు హెలికాప్టర్లో నిజామాబాద్ ఐడీఓసీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని పరిశీలిస్తారు. 1.50 గంటలకు MP ధర్మపురి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Dutyలో ఉన్న పోలీస్‌పై చేయిచేసుకున్న MLA కూతురు
National· 25 Aug 2026

Dutyలో ఉన్న పోలీస్‌పై చేయిచేసుకున్న MLA కూతురు

కర్ణాటకలో బీజేపీ MLA కూతురు మహిళా పోలీస్ ఆఫీసర్‌పై దాడి చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తుమకూరు రూరల్‌ MLA సురేశ్‌ గౌడ కూతురు ఐశ్వర్య.. మండ్య జిల్లాలోని శ్రీరంగపటణ టెంపుల్‌లో డ్యూటీలో ఉన్న మహిళా SI సవితాతో గొడవ పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను తిట్టి, చెంపదెబ్బ కొట్టినట్లు పోలీసుల తెలిపారు. దర్శనం కోసం క్యూలో వెళ్లాలని పోలీసులు చెప్పడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు బుక్ చేశారు. దీంతో ఎమ్మెల్యే సురేశ్‌ గౌడ ఈ వివాదంపై క్షమాపణలు(Apologises) చెప్పారు.

‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల ఆగ్రహం
Entertainment· 25 Aug 2026

‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల ఆగ్రహం

‘ఇరుముడి’ మూవీలో గవర్నమెంట్ టీచర్లను నెగిటివ్ గా చూపించడాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తప్పుబట్టింది. పైగా మూవీలో స్కూల్ పిల్లల యూనిఫాం కూడా ఏపీ ప్రభుత్వ స్కూళ్ల యూనిఫాంలానే ఉండటంతో ఏపీ స్కూళ్లు, ఏపీ టీచర్లపైన ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని, క్రియేటివిటీ పేరుతో మొత్తం ఉపాధ్యాయ సమాజాన్ని కించపరచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. రవితేజ లీడ్ రోల్లో నటించిన 'ఇరుముడి' హిట్ టాక్ తెచ్చుకుంది.

ఆ ప్రాంతాలకు పవర్‌ కట్‌.. వివరాలివే
TG· 25 Aug 2026

ఆ ప్రాంతాలకు పవర్‌ కట్‌.. వివరాలివే

TG: హైదరాబాద్‌లోని బాలాజీహిల్స్‌, హేమానగర్‌ ఫీడర్ల సర్కిల్‌లో 33 కేవీ టవర్‌ కన్స్ట్రక్షన్ వర్క్స్ కారణంగా ఈరోజు పవర్ సప్లై నిలిచిపోనుంది. మార్నింగ్ 11 గం. నుంచి ఈవెనింగ్ 4 గం. వరకు పవర్ సప్లై నిలిపివేస్తున్నట్లు చిల్కానగర్‌ AE వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సాయిభవానీనగర్‌, గాయత్రీహిల్‌, మల్లయ్యనగర్‌, వాసవినగర్‌, సప్తగిరి కాలనీ, నార్త్‌ బాలాజీహిల్స్‌ ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు. Consumers ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు?
International· 25 Aug 2026

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు?

ఏడేళ్ల తర్వాత షీ జిన్‌పింగ్ మళ్లీ భారత్‌కు వస్తారా? సెప్టెంబర్ 12–13న ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ఆసక్తి పెంచుతున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇదే టైమ్‌లో అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సరిహద్దు సమస్యపై చర్చలు జరుపుతున్నారు. 2020 తర్వాత కాస్త దూరమైన భారత్–చైనా సంబంధాలు ఇప్పుడు మళ్లీ కదులుతున్నాయి. ఒకవేళ షీ వస్తే.. సరిహద్దుపై ఏదైనా కొత్త నిర్ణయం వస్తుందా? అదే ఇప్పుడు అందరి చూపు.

APకి వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరిక
AP· 25 Aug 2026

APకి వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరిక

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తూ నార్త్ ఒడిశా, ఝార్ఖండ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది ఒడిశాలోని మారుమూల ప్రాంతాల వైపు కదలనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నిన్న కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. సతివాడలో 4.95, అనంతపురంలో 3.62, బొబ్బిలిలో 3.25 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. రానున్న 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలుల కారణంగా ఈరోజు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

AI వీడియోలో ఖవాజా ఆసిఫ్!
International· 25 Aug 2026

AI వీడియోలో ఖవాజా ఆసిఫ్!

తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన భారత్‌తో పోలుస్తూ పాకిస్థాన్ పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కనిపించింది. కానీ పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆ వీడియోను ఫేక్‌గా తేల్చింది. వీడియోలోని ఆడియోను AIతో తయారు చేశారని, ఖవాజా ఆసిఫ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఈ క్లిప్ వైరల్ కావడంతో భారత మీడియా, సోషల్ మీడియాలోనూ చర్చ పెరిగింది.

ఇరాన్‌తో వ్యాపారం చేసేవారికి అమెరికా వార్నింగ్!
International· 25 Aug 2026

ఇరాన్‌తో వ్యాపారం చేసేవారికి అమెరికా వార్నింగ్!

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతూ, ఆ దేశంతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, కంపెనీలపై కూడా secondary sanctions విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఇప్పటికిప్పుడు ఏ దేశంపై కొత్త శిక్షలు విధించలేదు; ముందుగా వ్యాపార సంబంధాలు తగ్గించుకునేందుకు సమయం ఇస్తున్నట్లు అమెరికా చెబుతోంది. ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉన్న చైనా విషయంలో ఈ నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇరాన్ కూడా తమపై ఆంక్షలకు సహకరించే దేశాలపై స్పందిస్తామని హెచ్చరిస్తోంది.

“రేపు చేద్దాం”.. అంటూ టైమ్ పోతుందా?
Motivational· 25 Aug 2026

“రేపు చేద్దాం”.. అంటూ టైమ్ పోతుందా?

“ఇది రేపు చేద్దాంలే” అని మనం రోజూ ఎన్నిసార్లు అనుకుంటామో లెక్కే ఉండదు. చిన్న పని కాబట్టి పర్లేదనిపిస్తుంది. కానీ ఇలా ఒక్కో పని వాయిదా పడుతూ పోతే.. మన టైమ్ మాత్రమే కాదు, మన అవకాశాలు కూడా జారిపోవచ్చు. చదువు కావచ్చు, కొత్త పని మొదలుపెట్టడం కావచ్చు, ఎవరికైనా మనసులో మాట చెప్పడం కావచ్చు.. “తర్వాత” అనే మాటతో మనమే మనల్ని ఆపుకుంటుంటాం. అసలు సమస్య పని చేయలేకపోవడం కాదు.. మొదలుపెట్టే క్షణాన్ని ప్రతిసారీ రేపటికి నెట్టేయడమే. “తర్వాత” కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఒకరోజు “ఇప్పుడైనా?” అని మనమే మనల్ని అడగాల్సి రావచ్చు.

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?
Technology· 24 Aug 2026

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?

వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక్కసారిగా “404 Not Found” అని కనిపించిందా? ఇది మీ ఇంటర్నెట్ పనిచేయడం లేదని అర్థం కాదు. మీరు ఓపెన్ చేయాలనుకున్న వెబ్‌పేజ్‌ను సర్వర్‌లో కనుగొనలేకపోయినప్పుడు ఈ Error వస్తుంది. ఉదాహరణకు, ఒక వెబ్‌పేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, దాని లింక్ మారి ఉండొచ్చు లేదా URL తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు. అందుకే 404 అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. “మీరు అడిగిన పేజ్ ఇక్కడ కనిపించలేదు” అన్నమాట. 💻

మరిపెడ నుంచి State under–14 క్రికెట్‌ జట్టుకు జశ్వంత్‌
Local· 24 Aug 2026

మరిపెడ నుంచి State under–14 క్రికెట్‌ జట్టుకు జశ్వంత్‌

మరిపెడ నుంచి మరో స్పోర్ట్స్ స్టార్ రెడీ అవుతున్నాడు. 🏏మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన మేరుగు జశ్వంత్ తెలంగాణ రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టుకు select అయ్యాడు. వరంగల్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ గా జశ్వంత్ చూపిన ప్రతిభ రాష్ట్ర సెలెక్టర్లను ఆకట్టుకుంది. ఇక ఈ నెల 26-29 వరకు ఛత్తీస్గఢ్ చంపా జిల్లాలో జరిగే టోర్నమెంట్లో తెలంగాణ తరఫున బరిలోకి దిగనున్నాడు. 🔥<br>సెయింట్ అగస్టీన్ పాఠశాలలో 7వ తరగతి చదివే ఈ చిన్నోడు మరింత గొప్పోడు అవ్వాలని wish చేద్దాం.

4 రోజుల్నుంచి No water.. ఉయ్యూరు మహిళల టెన్షన్!
Local· 24 Aug 2026

4 రోజుల్నుంచి No water.. ఉయ్యూరు మహిళల టెన్షన్!

ఉయ్యూరు 7వ వార్డు కాలవగట్టులో ముస్లిం మహిళలు తాగునీరు లేక అవస్థ పడుతున్నారు. 💧 అతిసార వ్యాధి నివారణ పేరిట పైప్‌లైన్ సరఫరా నిలిపివేశారు. ట్యాంకర్ల దగ్గర కుస్తీలవుతున్నయ్. 🚰 4 days నుంచి ఇంటి అవసరాలకు కూడా నీళ్లు లేవు. బస్తీ వాళ్లంతా కలిసి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు complaint చేశారు. అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చారు.

అమరావతి ఛాంపియన్షిప్.. 2 లక్షల మంది ఆటగాళ్లతో Asian Record!
Local· 24 Aug 2026

అమరావతి ఛాంపియన్షిప్.. 2 లక్షల మంది ఆటగాళ్లతో Asian Record!

New Record...! అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఏకంగా 2,07,498 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున Grass route నుంచి ఒకే వేదికపై ఆటగాళ్లను సమీకరించిన ఈ ఈవెంట్.. Asian Book of Records లో place సంపాదించుకుంది. ఆగస్టు 24న తిరుపతి ఎస్వీయూ తారకరామ స్టేడియంలో Asian Book of Records ప్రతినిధి ఆర్. హరీష్ చేతులమీదుగా శాప్ చైర్మన్ అనిమినీ రవి నాయుడు అవార్డు, సర్టిఫికెట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో Great mile stone.