Latest

Technology· 15 Apr 2026

CA టూ ఇన్‌ఫ్లుయెన్సర్.. సోషల్ మీడియాలో సంపాదన మామూలుగా లేదుగా!

ఒక 23 ఏళ్ల CA అతను ఏడాదికి రూ.8 లక్షలు వచ్చే తన జాబ్‌ను వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 12 గంటల పని ఒత్తిడి భరించలేక, Social Media Influencerగా మారి ఆర్థిక విషయాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో తక్కువ ఆదాయం వచ్చినా, ఇప్పుడు సంవత్సరానికి రూ.15 లక్షలు సంపాదిస్తూ సక్సెస్ అయ్యాడు. తన ప్యాషన్‌ను నమ్మి కెరీర్‌ను మార్చుకుని ఇతరులకు Inspirationగా నిలుస్తున్నాడు.

కూల్‌డ్రింక్‌లో ఎలుక!▶
Politics· 15 Apr 2026

కూల్‌డ్రింక్‌లో ఎలుక!

అమెరికాలో ఒక యువతికి స్టార్‌బక్స్ ఎనర్జీ డ్రింక్ కొంటే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ డ్రింక్ టిన్‌ బరువుగా ఉండటం, బ్యాడ్ స్మెల్ రావడంతో ఆమెకు డౌట్ వచ్చింది. వెంటనే కత్తితో ఆ టిన్‌ను కోసి చూడగా.. లోపల చచ్చిన ఎలుక కనిపించింది. దీనికి సంబంధించిన Video ఇప్పుడు Social Mediaలో వైరల్ అవుతోంది. అయితే కొందరు నెటిజన్లు ఇది ఫేక్ అని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు.

CBSE 10th క్లాస్ రిజల్ట్స్ అప్‌డేట్! ఎలా చెక్ చేసుకోవాలో చూడండి..
Local· 15 Apr 2026

CBSE 10th క్లాస్ రిజల్ట్స్ అప్‌డేట్! ఎలా చెక్ చేసుకోవాలో చూడండి..

సీబీఎస్‌ఈ 10th రిసల్ట్స్ కోసం లక్షలాది మంది స్టూడెంట్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ రిజల్ట్స్ నేడు ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను Official Website లో {www.cbse.gov.in}, or , {results.cbse.nic.in}, వెబ్‌సైట్లతో పాటు DigiLocker, UMANG యాప్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ వారంలోనే రిసల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

పీడియాట్రిషన్ అకాడమీకి డాక్టర్ శివరంజని సంతోష్ రాజీనామా
Local· 15 Apr 2026

పీడియాట్రిషన్ అకాడమీకి డాక్టర్ శివరంజని సంతోష్ రాజీనామా

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నకిలీ ORS పానీయాలపై గత ఎనిమిదేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటం ఇంటర్నెట్ ని షేక్ చేసింది.ఫార్మా కంపెనీలు ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తూ వేధిస్తున్నాయి. తన పోరాటాన్ని మాతృసంస్థ IAP గుర్తించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. పిల్లల ఆరోగ్యం లేదా IAP.. ఈ రెండింటిలో ఏది కావాలంటే పిల్లలనే ఎంచుకుంటాను చెప్పారు.

పంజాబ్ తీసేసింది.. సెంట్రల్ ఇచ్చింది
Politics· 15 Apr 2026

పంజాబ్ తీసేసింది.. సెంట్రల్ ఇచ్చింది

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆయనకున్న Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించింది. మరోవైపు ఆయనకు ప్రాణహాని ఉందన్న వార్తలతో కేంద్ర ప్రభుత్వం Z కేటగిరి భద్రత కల్పించింది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీతో దూరంగా ఉంటూ బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. దీంతో ఈ భద్రత కూడా ఒక పొలిటికల్ గేమ్ గా మారింది. ఈ మధ్య రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానంలో రాఘవ్ చద్దాను తీసివేసిన ఆప్ ఎంపీ మిట్టల్ ను నియమించింది.

5 సిక్స్‌లు కొడితే సరిపోదు.. రింకు సింగ్‌పై క్రిస్ శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!
Sports· 15 Apr 2026

5 సిక్స్‌లు కొడితే సరిపోదు.. రింకు సింగ్‌పై క్రిస్ శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2026లో కేకేఆర్ వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోవడంతో రింకు సింగ్‌పై విమర్శలు మొదలయ్యాయి. మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ రింకు బ్యాటింగ్ తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడో ఒకే ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టాడని అతడిని పెద్ద హిట్టర్‌గా చూడలేం. రింకుకి నంబర్ 5 పొజిషన్ సెట్ అవ్వదు, నంబర్ 7 అయితేనే కరెక్ట్ అని శ్రీకాంత్ విమర్శించారు. భారీ షాట్లు కొట్టే సామర్థ్యం రింకుకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గుంటూరులో మర్డర్ చంపింది లాయరే!
Crime· 15 Apr 2026

గుంటూరులో మర్డర్ చంపింది లాయరే!

గుంటూరులో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు. లాయర్ సురేశ్ తన ఫ్రెండ్‌తో కలిసి ఈ మర్డర్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరించాడు. బాధితురాలికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని సురేశ్ 25 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత డబ్బుల విషయంలో గొడవలు రావడంతో, ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. శ్రీశైలం వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, తలపై కర్రలతో కొట్టి చంపేసి బాడీని కాలువలో పడేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కన్న కూతురిని చంపి తల్లి ఆత్మహత్య!
Crime· 15 Apr 2026

కన్న కూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

బెంగళూరులో 40 ఏళ్ల సువర్ణ అనే మహిళ తన 14 ఏళ్ల కూతురు కారుణ్యను గొంతునులిమి చంపేసింది. ఆ తర్వాత తను కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని Suicide చేసుకుంది. శనివారం ఉదయం ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ లు డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. ఎందుకు తల్లి ఇలా చేసింది అని పోలీసులు ప్రెసెంట్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

సమ్మర్ లో కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి!▶
Health· 15 Apr 2026

సమ్మర్ లో కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి!

ఈ ఇయర్ ఎండలు చాలా ముదిరిపోతున్నాయని. దీనిపై డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ కొన్ని టిప్స్ చెప్పారు. ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే బయట దొరికే కూల్ డ్రింక్స్ తాగి హెల్త్ పాడుచేసుకోవద్దు. వాటికి బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి నాచురల్ డ్రింక్స్ ఎక్కువగా తాగాలి. మీ బాడీని Hydrated గా ఉంచుకుంటేనే ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండగలరని ఆయన సూచించారు.

ఏప్రిల్ థర్డ్ వీక్ లో 7 సినిమాలు రిలీజ్
Entertainment· 15 Apr 2026

ఏప్రిల్ థర్డ్ వీక్ లో 7 సినిమాలు రిలీజ్

ఏప్రిల్ థర్డ్ వీకెండ్‌లో ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాగశౌర్య నటించిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్', కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన 'తిమ్మరాజుపల్లి టీవీ', తిరువీర్ యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్', వీటితో పాటు 'గాలి', 'తెరచాప', 'కాలగమనం' మరియు తమిళ డబ్బింగ్ మూవీ 'మిస్టర్ ఎక్స్' కూడా రిలీస్ ఔతుంది. మరి ఈ వారం థియేటర్లలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.

బిహారీ టాకోస్'తో నెలకు ₹1.3 కోట్లు!
Business· 15 Apr 2026

బిహారీ టాకోస్'తో నెలకు ₹1.3 కోట్లు!

ప్రపంచంలో జాబ్ సెక్యూరిటీయే లేదు. ఎవరి ఉద్యోగం పోతుందో ఎప్పుడు పోతుందో తెలీదు. జీషన్ బఖ్రానీ అనే ఇండియన్ కి న్యూయార్క్ లో హై ప్రొఫైల్ జాబ్ పోయింది. అలా రెండు సార్లు లే ఆఫ్ లు ఎదుర్కొన్నాడు. దీంతో తన సేవింగ్ నుంచే మన్ హట్టన్ లో స్ట్రీట్ పుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. 'బిహారీ టాకోస్' అమ్ముతూ ఇప్పుడు కోట్లు కొల్లగొడుతున్నాడు! మన దేశీ ఫ్లేవర్స్‌ని మెక్సికన్ స్టైల్‌తో మిక్స్ చేసి ఒక క్రేజీ Fusion బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నెలకు ₹1.3 కోట్ల టర్నోవర్‌తో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాడు.

నాకు అత్తామామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్
Politics· 15 Apr 2026

నాకు అత్తామామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన అత్తమామలైన ఉషా చిలుకూరి పేరెంట్స్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో Key Role పోషిస్తున్నారని మాట్లాడారు. ఇదే సమయంలో H-1B వీసా వ్యవస్థలో మార్పులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్‌తో ఉన్న పాత గొడవలు రాత్రికి రాత్రే పోవని, అయితే శాంతి ఒప్పందం కోసం Trump నేతృత్వంలో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మలక్కా జలసంధి !
World· 15 Apr 2026

ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మలక్కా జలసంధి !

హార్మూజ్ జలసంధిపై పట్టుసాధించలేక ఆపసోపాలు పడుతున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మలక్కా జలసంధిపై కన్ను వేశారు. ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఇందులో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా విమానాలకు ఇండోనేషియా గగనతలంలో ప్రవేశం లభిస్తుంది, ఇది మలక్కా జలసంధిపై నిఘా ఉంచేందుకు అమెరికాకు సాయపడుతుంది. ఇండోనేషియా,మలేసియా, సింగపూర్ మీదుగా సాగే ఈ జలసంధి ద్వారా ప్రపంచ వాణిజ్యంలో 40శాతం రవాణా అవుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అమెరికా-భారత్ సహకారం మరింత పెరిగి, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంది.

ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ కు చెందిన యూనివర్సిటీపై ఈడీ దాడులు
Politics· 15 Apr 2026

ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ కు చెందిన యూనివర్సిటీపై ఈడీ దాడులు

కేంద్రంలో అధికార బీజేపీ సీబీఐ, ఈడీలను పొలిటికల్ గా ఎలా వాడుకుంటుందో చెప్పే మరో ఘటన ఇది. ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలపై ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు. విదేశీ నిధుల మళ్లింపు మరియు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో రాఘవ్ చద్దా స్థానంలో పార్టీ డిప్యూటీ చీఫ్‌గా మిట్టల్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఈ దాడులు మొదలయ్యాయి. రాఘవ్ చద్దా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఈ దాడులు రాజకీయ కక్షసాధింపేనని ఆప్ అంటోంది.

బి.సి. హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!▶
Crime· 15 Apr 2026

బి.సి. హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బి.సి. గర్ల్స్ హాస్టల్ లో 8త్ క్లాస్ స్టూడెంట్ శ్రావణి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ అమ్మాయి గుండెపోటుతో చనిపోయిందని హాస్టల్ స్టాఫ్ చెబుతున్నారు, పేరెంట్స్ మాత్రం తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

బీహార్‌లో బీజేపీ తొలి సీఎంగా సామ్రాట్ చౌధరి ప్రమాణం
Politics· 15 Apr 2026

బీహార్‌లో బీజేపీ తొలి సీఎంగా సామ్రాట్ చౌధరి ప్రమాణం

బీహార్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. బీజేపీ నేత సామ్రాట్ చౌధరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న సామ్రాట్ ఇప్పుడు రాష్ట్ర పగ్గాలను చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీహార్‌లో బీజేపీ తన పట్టు మరింత బిగించింది.

350 అశ్లీల వీడియోలు తీసి బెదిరింపులు
Crime· 15 Apr 2026

350 అశ్లీల వీడియోలు తీసి బెదిరింపులు

మహారాష్ట్రలోని అమరావతిలో షాకింగ్ క్రైమ్ బయటపడింది! 180 మందికి పైగా మైనర్ బాలికలను మహమ్మద్ అయాజ్ అనే యువకుడు లైంగికంగా వేధించాడు. స్నాప్‌చాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అమ్మాయిలను టార్గెట్ చేసి, సుమారు 350 అశ్లీల వీడియోలు తీసి వాళ్లను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వీడియోలతో బాధితులను వేధించేవాడు. రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే దృష్టికి ఈ విషయం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో తెలియని వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి! Be safe and Stay alert

B 12 లోపిస్తే ఇవి తినండి!
Health· 15 Apr 2026

B 12 లోపిస్తే ఇవి తినండి!

వెజిటేరియన్స్ అయితే... *రోజూ ఒక గ్లాసు పాలు, పెరుగు లేదా పనీర్ *ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డు * విటమిన్లు కలిపిన ఓట్స్ లేదా కార్న్ ఫ్లేక్స్ వంటి 'Fortified Foods' బెటర్.. *నాన్ వెజిటేరియన్స్ కి సాల్మన్, ట్యూనా వంటివి చేపలు మేలు . వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు B12 పుష్కలంగా ఉంటుంది. *లీన్ మీట్ మరియు చికెన్ తీసుకోండి * షిటాకే (SHIITAKE) పుట్టగొడుగులలో కొంత మేర B12 దొరుకుతుంది.

 విటమిన్  బీ 12 లోపిస్తే జరిగేది ఇదే !!
Health· 15 Apr 2026

విటమిన్ బీ 12 లోపిస్తే జరిగేది ఇదే !!

' ఎక్కువ అలసిపోవడం, బాగా నీరసంగా ఉండటం.. *నాడులు దెబ్బతినడం వల్ల చేతులు మరియు కాళ్ళలో సూదులతో గుచ్చినట్లు లేదా తిమ్మిర్లుగా అనిపిస్తుంది. *విషయాలను మర్చిపోవడం, ఏకాగ్రత లేకపోవడం మరియు గందరగోళంగా అనిపించడం. *నాలుక ఎర్రగా మారడం లేదా నోటిలో తరచూ పుండ్లు కావడం. *కొద్ది దూరం నడిచినా ఆయాసం రావడం లేదా గుండె దడ రావడం. *చర్మం పసుపు రంగులోకి లేదా పాలిపోయినట్లు కనిపించడం

రేవంత్ హైబ్రిడ్ నమూనా ఇదే
Politics· 15 Apr 2026

రేవంత్ హైబ్రిడ్ నమూనా ఇదే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ నమూనా విధానంలో రెండు రకాలుగా ఎలా లోక్ సభ సీట్లు పెంచాలో చెప్పారు. హైబ్రిడ్ నమూనా 1 : దేశంలో పెంచాలనుకుంటున్న సీట్లలో 50% ఆయా రాష్ట్రాల జీడీపీ ఆధారంగా మరో 50% ఆ రాష్ట్ర ఆర్థిక పనితీరు, జనాభా ఆధారంగా పెంచాలి. జీడీపీ వృద్ధికి 70% GDP per capitaకి 15%, తలసరి ఆదాయానికి 15% వెయిటేజీ ఇవ్వాలి. హైబ్రిడ్ నమూనా 2 : ఈ నమూనా ప్రకారం 40శాతం జనాభా, 40 శాతం ఆర్థిక పనితీరు, 20శాతం సమాఖ్య స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకొని సీట్లను పెంచాలి. అప్పుడే పార్లమెంట్ లో ఏ ప్రాంతానికి ఆధిపత్యం ఉండదు. జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.

డీలిమిటేషన్ పై ఎందుకింత వ్యతిరేకత ?
Politics· 15 Apr 2026

డీలిమిటేషన్ పై ఎందుకింత వ్యతిరేకత ?

డీ లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతోంది. కేంద్రం ప్రోరేటా అంటే జనాభా ప్రకారం సీట్ల పెంపు ఈ నమూనాలో ఇప్పుడున్న సీట్లకు మరో 50 శాతం కలుపుతారు. ప్రస్తుత సీట్లు యూపీ+బీహార్+ఎంపీ - 149 (27%) తమిళనాడు+కర్ణాటక+కేరళ - 87 16% Ratio : 1.7 : 1 డీలిమిటేషన్ తర్వాత యూపీ+బీహార్+ఎంపీ - 274 (32%) తమిళనాడు+కర్ణాటక+కేరళ - 110 (13%) Ratio : 2.49 : 1 సీట్ల నిష్ఫత్తిలో ఇంత భారీ తేడా వచ్చేస్తుంది