Latest

రేబిస్ డాగ్స్ ఇక కనిపించవా?
కేరళం గవర్నమెంట్ రేబిస్ సోకిన, నయం చేయలేని డిసీజెస్‌తో బాధపడుతున్న అలాగే డేంజరస్‌గా మారిన వీధి కుక్కలకు మెర్సీ కిల్లింగ్ (దయామరణం) చేసేందుకు standard operating procedures (SOP)ని అప్రూవ్ చేసింది. ఈ ఏడాది Mayలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకునే ఈ డెసిషన్ తీసుకున్నారు. దీనికోసం ప్రతి లోకల్ బాడీలో ఒక స్పెషల్ కమిటీని సెటప్ చేస్తారు. ఒక కుక్కకు మెర్సీ కిల్లింగ్ చేయాలా వద్దా అనేదానిపై ఈ కమిటీయే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.

వనపర్తిలో భారీ ధర్నా
TG : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తిలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీ ప్రకారం పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి, వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో వేయాలన్నారు. సిబ్బందిని అక్రమంగా తీసేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని, కార్మికులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు.

రూ.26 వేలు.. 2వ PRCలో గుర్తింపు...
వనపర్తిలో సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా – డిమాండ్లు ఇవే!<br>సోమవారం నిర్వహించిన ఈ ఆందోళనలో యూనియన్ నాయకులు ప్రభుత్వానికి 10 పాయింట్లు ఇచ్చారు. అందులో.. పర్మినెంట్ ఉద్యోగాలు, 2వ PRCలో గుర్తింపు, కనీస వేతనం రూ.26,000, G.O.51 సవరణ, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, గ్రీన్ ఛానల్ ద్వారా ఆన్లైన్ జీతాలు, తొలగింపులపై చట్టపరమైన చర్యలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపు వంటివి ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ మానిఫెస్టోలేనివేనని సిఐటియు నాయకులు గుర్తు చేశారు. సర్కారు ఎంతకాలం నానుస్తదో చూడాలి.

కాలేజీలో సడన్‌గా తనిఖీలు
TG : షాద్‌నగర్‌లోని గిరిజన సంక్షేమ Degree,PG కాలేజీలో మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి ప్రణయ్ కుమార్ టీమ్‌తో కలిసి తనిఖీలు చేశారు. కాలేజీలో పిల్లలకు వసతులు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉందో దగ్గరుండి చూశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, 'ఏం కష్టాలున్నా, సమస్యలున్నా మాకు చెప్పండి' అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ యాదవ్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఆరోగ్యానికి సామ.. సరైన ధర లేదు!
ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారంగా సాగయ్యే చిట్టిగింజల సామ – ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లో పాక్షికంగా మిగిలిన ఈ పంట – ఆగస్టు-సెప్టెంబర్లో చేతికొస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుంటే – బీపీ, షుగర్ తగ్గించడంలో సామ బియ్యం సూపర్ అంటారు డాక్టర్లు. అయినా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆదివాసీ రైతులు ఈ పంటను వదిలేస్తున్నారు. ప్రభుత్వం MSP ప్రకటించి, ప్రోత్సాహకాలు ఇస్తేనే ఈ సాంప్రదాయ పంటకు లైఫ్. లేకుంటే హిస్టరీ బుక్స్ కే పరిమితం.
ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి 8వ తరగతి స్టూడెంట్ మృతి
AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడు. అతని తండ్రి ఆవేదనతో “లేవు నాన్నా. నీవు లేకుండా నేనేం చేయాలి?” అని ఏడవటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. మరో విద్యార్థి అక్షయ్ కాలు విరగడంతో చికిత్స పొందుతున్నాడు.
సొంత ఊరే టార్గెట్.. తీన్మార్ మల్లన్న ఫిక్స్!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచే పోటీ – అదే తీన్మార్ మల్లన్న చెప్పారు! వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆలేరు నుంచే బరిలో దిగుతానని, ఆ ప్రాంతంతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేశారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడ్నుంచే కొనసాగుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆలేరు – ఇక్కడి ఓటర్లు, అభిమానులు, రాజకీయ నాయకులు మల్లన్న ఈ ప్రకటనతో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. దీంతో ఇక మరో రౌండ్ ఎన్నికల హడావుడి మొదలైనట్టే!

HP గ్యాస్ నుంచి 'నవ్య' సిలిండర్
HP గ్యాస్ కంపెనీ కొత్తగా ‘నవ్య’ అనే సిలిండర్‌ను తీసుకొచ్చింది. దీనికి ముందుగా బుకింగ్ చేసుకుని సిలిండర్ ఎప్పుడు వస్తుందో అని ఆగాల్సిన పనిలేదు. ఇంట్లో గ్యాస్ అయిపోయి అత్యవసరంగా కావాలనుకున్నప్పుడు నేరుగా ఇచ్చేలా ఈ సదుపాయం తెచ్చారు. ఈ కొత్త సిలిండర్ ఎలా పనిచేస్తుందనే దానిపై HP అధికారులు జనాలకు వివరంగా చెబుతున్నారు.

చిన్నారులతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు: ఎస్సై
AP: చిన్నారులను ఆసరాగా చేసుకుని భిక్షాటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిసర ప్రాంతాల్లో పసిపిల్లలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న మహిళలకు అధికారులు అవగాహన కల్పించారు. చిన్నారులను భిక్షాటనలో ఉపయోగించడం వల్ల వారి భద్రత, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్నారులను భిక్షాటనకు దూరంగా ఉంచాలని సూచించారు.

వర్షం లేదు.. పాప్ కార్న్ ఎగుమతి!
వర్షాకాలం దగ్గర పడుతోంది కానీ.. రాష్ట్రంలో ఇప్పటికే 52% వర్షపాతం లోటని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బంది తప్పకుండా ఉంటుందని, వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక పాజిటివ్ వార్త ఏంటంటే – ఏలూరు ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్ కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కలిసి ప్రారంభించారు. "ఇక్కడి నుంచి పాప్ కార్న్ ప్రపంచానికి ఎగుమతి చేయాలి" అని సీఎం లక్ష్యం పెట్టారు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నా... వర్షం మాత్రం ఇప్పటికీ కరువే!

డ్రైవర్‌కు గుండెపోటు.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన బస్సు
AP: గుంటూరు ఎస్‌వీఎన్ కాలనీ సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌కు ప్రయాణిస్తుండగానే తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. బస్సులో ఉన్న పాఠశాల చిన్నారులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సు వద్దకు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
TG: జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి 53 ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీపై సమగ్ర విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 182 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటిలో 93 దరఖాస్తులు 30 రోజులకు పైగా పరిష్కారం కాకుండా ఉన్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ రైలు కూత
TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రైల్వే స్టేషన్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 20 ఏళ్లుగా ప్యాసింజర్ రైళ్లు ఆగిపోయి, కేవలం బొగ్గు రవాణాకు (గూడ్స్) మాత్రమే వాడుతున్న ఈ ట్రాక్‌పై మళ్లీ ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ పనులు ప్రారంభించింది. 20 ఏళ్ల తర్వాత తమ ఊరి నుంచి మళ్లీ రైలు ఎక్కవచ్చని ఇల్లందు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.
బ్రిటిష్ కాలం నాటి స్టేషన్కు మళ్లీ శ్వాస!
భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ మళ్లీ సజీవమవుతోంది! బొగ్గు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా నడిచే ఈ స్టేషన్లో గూడ్స్ మాత్రమే మిగిలి, ప్యాసింజర్ సేవలు 20 ఏండ్లుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. తొలి దశలో కారేపల్లి నుంచి ఇల్లందు వరకు రైల్వే మార్గం, స్టేషన్ మౌలిక వసతుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. స్వాతంత్ర్యానికి ముందే నిజాం కాలంలో విజయవాడ–డోర్నకల్ మీదుగా ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు నడిచిన చరిత్ర ఉంది.

కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
TG: జీవో 97ను వ్యతిరేకిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను జీవో 97 ద్వారా ‘శక్తి’ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విలీనంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ECET ద్వారా బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ అవకాశం దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

జీవో 97ను వెనక్కి తీసుకోండి
హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ సెంటర్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు రోడ్డు ఎక్కి దర్నా చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 97 వల్ల తమ చదువులు, భవిష్యత్తు నాశనమైపోతాయని రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల ముఖ్యంగా పేద పిల్లలే నష్టపోతున్నారని అంటున్నారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర గట్టిగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!
TG: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, భారీ హోర్డింగులు, పెద్ద చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాలకు Yellow అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?
భీమదేవరపల్లిలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి రాకపోవడంతో న్యాయవాది తాళ్లపల్లి మధుకర్ ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఎంపీడీవో ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో – అధికారులిచ్చిన టైమ్‌కు వాళ్లే రాలేదట. "ప్రజా సమస్యల కోసం వచ్చిన వాళ్లందరూ ఎదురుచూడాల్సిందేనా?" అంటూ మధుకర్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు."అధికారులే లేట్ అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలే" – ఇదీ ఆయన ప్రశ్న. ఇప్పుడు ఈ ఫిర్యాదు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకుని ఓ క్లియర్ మెసేజ్ ఇస్తారో లేదో చూడాలి.

రామాయంపేట రోడ్లపై నరకయాతన.. స్థానికుల ఆవేదన
TG: చిన్న వర్షానికే రామాయంపేట రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.. గుంతల్లో నిలిచిపోతున్న వర్షపు నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల్లో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు నీటితో నిండిపోవడంతో వాటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదన్నారు.

ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ
AP : ఆంధ్రప్రదేశ్‌లోని 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70 భూ బదిలీ నిరోధక చట్టమే కొండంత అండ. కానీ, ఈ చట్టాన్ని సవరించాలని కోరుతూ 2023లో 1,672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ పక్షాన గట్టిగా నిలబడి, హక్కుల రక్షణ కవచమైన 1/70 చట్టాన్ని కాపాడాలని ఆదివాసీ సమాజం ఆశగా ఎదురుచూస్తోంది.

1/70 పై ఎపి కౌంటర్?
ఏపీ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూహక్కులకు కవచమైన 1/70 చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టులో టక్కర్‌కు సిద్ధంగా ఉంది. 2023లో 1,672 మంది గిరిజనేతరులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి భూములు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందని వారి వాదన. ఇప్పటికే అల్లూరి జిల్లాలో ఆదివాసీలు భారీ ర్యాలీలు నిర్వహించినప్పుడు, ఆదివాసీల తరఫున సుప్రీంలో కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని మర్చిపోయింది.. ఇప్పటికైనా మేల్కొంటుందా?