Latest

దిల్లీలో పోలీసులపై అటాక్.. కారం పొడి, ఇటుకలతో దాడి!
National· 24 Aug 2026

దిల్లీలో పోలీసులపై అటాక్.. కారం పొడి, ఇటుకలతో దాడి!

దిల్లీలోని ముకుంద్‌పూర్‌లో పోలీసులపై అటాక్ జరిగింది. పెట్రోలింగ్‌లో ఉన్న ముగ్గురు పోలీసులపై కొంతమంది కారం పొడి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ హెడ్ కానిస్టేబుల్‌కు తలకు గాయమైంది. సరైన డాక్యుమెంట్స్ లేని బైక్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నాయి.

పనిచేయని గాలి యంత్రం..  వాహనదారుల అవస్థలు
Local· 24 Aug 2026

పనిచేయని గాలి యంత్రం.. వాహనదారుల అవస్థలు

TG: ఐదురోజులుగా గాలి నింపే యంత్రం పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో ఏర్పాటు చేసిన గాలి నింపే యంత్రం గత ఐదు రోజులుగా అందుబాటులో లేదని వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో గాలి నింపుకోవడానికి వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
Current Affairs· 24 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటంతో గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,63,970 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,50,300 గా నమోదైంది. పసిడి ప్రియులు గోల్డ్ షాపింగ్ చేసేముందు లైవ్ రేట్లను ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్.

మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం: ఎస్‌ఎఫ్‌ఐ
Local· 24 Aug 2026

మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం: ఎస్‌ఎఫ్‌ఐ

AP: విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాయదుర్గం పర్యటనను అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విద్యా సమస్యలపై బంగి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాలు, డిగ్రీ కళాశాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, తాగునీరు అందించాలని కోరారు.

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 5కే రన్
Local· 24 Aug 2026

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 5కే రన్

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాని పబ్లిక్ పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా 5కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నర్సంపేట సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

230 మంది విద్యార్థులు..మూడే తరగతులు
Local· 24 Aug 2026

230 మంది విద్యార్థులు..మూడే తరగతులు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కరీముఖిపుట్ ZPHSలో సుమారు 230 మంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ కలిపి మూడే తరగతుల్లో పాఠాలు చెప్తున్నారు. వీటికి పైకప్పు సరిగా లేదు. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో తరగతుల్లోకి నీరు చేరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు సైతం ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మరిన్ని తరగుతులు నిర్మించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

యువత రాజకీయ ప్రలోభాలకు దూరంగా ఉండాలి: డీవైఎఫ్‌ఐ
Local· 24 Aug 2026

యువత రాజకీయ ప్రలోభాలకు దూరంగా ఉండాలి: డీవైఎఫ్‌ఐ

AP: యువత రాజకీయ ప్రలోభాలకు దూరంగా ఉండాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ నాయకుడు యనమల చరణ్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం శ్రీరామపురంలో డీవైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. యనమల చరణ్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి.. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, గంజాయి మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు యువతను చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయని ఆరోపించారు.

OSD సుమంత్ కేసులో పోలీసుల స్పీడ్.. మరో ముగ్గురు అరెస్ట్!
TG· 24 Aug 2026

OSD సుమంత్ కేసులో పోలీసుల స్పీడ్.. మరో ముగ్గురు అరెస్ట్!

TG: కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రధాన నిందితుడు సుమంత్‌తో పాటు మరో ఇద్దరు Abscondingలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి.

నీటి కోసం నిత్యం పోరాటం
National· 24 Aug 2026

నీటి కోసం నిత్యం పోరాటం

AP: గుక్కెడు నీటి కోసం ప్రతిరోజూ దూరం వెళ్లాల్సిన దుస్థితి.. తాండవలస గిరిజనులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని చిడిమెట్టు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో దూరంగా ఉన్న నీటి ఊటల నుంచి ప్రతిరోజూ నీటిని మోసుకురావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మహమ్మద్ ఖదీర్‌బాబుకు బుక్‌ బ్రహ్మ సాహిత్య పురస్కారం
Arts/Literature· 24 Aug 2026

మహమ్మద్ ఖదీర్‌బాబుకు బుక్‌ బ్రహ్మ సాహిత్య పురస్కారం

బెంగళూరులో మూడు రోజులపాటు నిర్వహించిన బుక్‌ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఈ ఏడాది బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ తెలుగు రచయిత, జర్నలిస్టు మహమ్మద్ ఖదీర్‌బాబు అందుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఖదీర్‌బాబు కథా రచయిత, సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు. ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మబండ కతలు’, ‘న్యూ బాంబే టైలర్స్’, ‘బియాండ్ కాఫీ’, ‘మెట్రో కథలు’, ‘దాహగీతి’ కథా సంకలనాలు వెలువరించారు. ‘రైటర్స్ మీట్’ స్థాపించి యువ రచయితలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి
Local· 24 Aug 2026

నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

AP: ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!
TG· 24 Aug 2026

ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!

TG: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఈరోజు నుంచి ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. తెలంగాణాలో 92.8 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తప్పులను అధికారులు గుర్తించారు. వారిలో 60.51 లక్షల అనామలీస్, 32.36 అన్-మ్యాపింగ్ లో ఉన్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వనున్నారు. 2002లో ఓటర్ల లిస్ట్ తో వివరాలు మ్యాచ్ కాకపోవడం, ఎన్యుమరేషన్ Formsలో తేడాలు వంటి కారణాలతో నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు కొన్ని Documentsతో వివరాలను Verify చేసుకోవాలని అధికారులు సూచించారు.

హౌస్‌కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
Local· 24 Aug 2026

హౌస్‌కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

AP: విశాఖ విమానాశ్రయంలో ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా విమానాశ్రయం వద్ద కార్మికులు చేస్తున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. సొంతింటి కల సాకారం
Local· 24 Aug 2026

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. సొంతింటి కల సాకారం

TG: సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు గొప్ప వరమని మంచిర్యాల 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ అన్నారు. డివిజన్‌లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. చివరకు ప్రమాదం
Local· 24 Aug 2026

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. చివరకు ప్రమాదం

TG: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని తిరందాజ్ టాకీస్ సమీపంలో సంగీత మొబైల్ ఎదురుగా మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. గుంతను 15 రోజులుగా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితమే స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు అదే గుంతలో పడిపోయారు. టర్నింగ్ వద్ద గుంత ఉండటంతో ఎప్పుడు పెద్ద ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో అత్యధిక డిగ్రీలున్నదెవరికో తెలుసా?
Infotainment· 24 Aug 2026

దేశంలో అత్యధిక డిగ్రీలున్నదెవరికో తెలుసా?

దేశంలో అత్యధిక డిగ్రీలున్నదెవరికో తెలుసా? మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ జిచ్కర్‌కు. దేశంలో అత్యంత విద్యావంతుల్లో ఒకరిగా నిలిచిన ఆయన సివిల్ సర్వెంట్‌, రాజకీయ నాయకుడు కూడా కావడం విశేషం. 1973 నుంచి 1990 వరకు 42 యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసి 20 డిగ్రీలు సాధించారు. చాలా వాటిలో ఫస్ట్ క్లాస్, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదైంది. 26 ఏళ్లకే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై దేశంలో అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2004లో రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు.

పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్ జాబితా విడుదల
Local· 24 Aug 2026

పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్ జాబితా విడుదల

AP: స్థానిక సంస్థల ఎన్నికలు–2026కు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ గ్రామ సచివాలయం వద్ద ప్రచురించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ స్థానిక నాయకుల సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 5,391 మంది ఓటర్లకు 14 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. అన్ని కేంద్రాలను జిటిడబ్ల్యూ హైస్కూల్, రింతాడలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను సచివాలయం నోటీసు బోర్డులో ఉంచారు.

కన్నతల్లినే కడతేర్చిన కొడుకు.. వనపర్తిలో దారుణం
Local· 24 Aug 2026

కన్నతల్లినే కడతేర్చిన కొడుకు.. వనపర్తిలో దారుణం

TG: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లినే కొడుకు దారుణంగా హతమార్చిన ఘటన వనపర్తిలో కలకలం రేపింది. గాంధీనగర్‌ కాలనీలో 60 ఏళ్ల రజియా బేగంను బలమైన ఆయుధంతో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? లేక మరేదైనా ఇతర కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తల్లిపై కన్నకొడుకు ఇంతటి కర్కశత్వానికి పాల్పడటంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా మారిన రహదారి.. పట్టించుకోని అధికారులు
Local· 24 Aug 2026

అధ్వానంగా మారిన రహదారి.. పట్టించుకోని అధికారులు

TG: కొమురంభీమ్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి–సోమిని మధ్య రహదారి పలుచోట్ల భారీ గుంతలతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతోపాటు గూడెం, అహేరి వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే రహదారిని వినియోగిస్తున్నాయి. గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు
Local· 24 Aug 2026

బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు

AP: జనాభాలో బహుజనులు అధికంగా ఉన్నా.. రాజకీయ అధికారం మాత్రం కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉందని, ఈ పరిస్థితి మారాలంటే బహుజన రాజ్యాధికారం సాధించాల్సిందేనని ఏఐబీఎస్పీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు‌లో చంద్రప్ప అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆల్‌ ఇండియా బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా గౌరవ అధ్యక్షులు తరిగొండ మణి మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదన్నారు.

వివాహ వేడుక నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం
Local· 24 Aug 2026

వివాహ వేడుక నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

TG: పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహానికి హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా నక్కలపల్లి స్టేజ్ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాముల గ్రామానికి చెందిన మద్దటి పెద్ద చిన్నయ్య (68) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడగా, స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.