Latest

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥
Gen Z· 23 Aug 2026

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన యువత ఆందోళనపై త్వరలో డాక్యుమెంటరీ రాబోతోంది. జర్నలిస్ట్ అతుల్ హోవలే దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఈ ఉద్యమాన్ని రికార్డు చేశారు. బేగంపురా ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆందోళన, సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష నుండి పార్లమెంట్ మార్చ్ వరకు.. వీధుల్లోనే వారాల తరబడి ఉన్న విద్యార్థుల ఉద్యమం రియల్ స్టోరీని ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాం అని డైరెక్టర్ ప్రకటించారు.

కోస్తా అదానీకేనా? సీపీఎం నో!
Local· 23 Aug 2026

కోస్తా అదానీకేనా? సీపీఎం నో!

శ్రీకాకుళం కోస్తా ఇక అదానీ సొంతమా? సీపీఎం లీడర్ జిల్లా సెక్రటరీ డి.గోవిందరావు షాకింగ్ క్లారిటీ ఇచ్చారు – ఈ డీల్ క్యాన్సిల్ చేయాలి! Rare Earth తవ్వకాల పేరుతో తీరం ఇస్తే మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయి, ఉప్పునీరు పంటల్లోకి వచ్చి రైతులకు నష్టం, పర్యావరణానికి తీవ్ర ముప్పు. టెక్కలి, సంతబొమ్మాళిలో భూసేకరణ ఆపేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని సీపీఎం వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇంకా ఎంత వరకు సాగుతుందో చూడాలి!

గోదావరిఖనిలో కరెంటు బంద్!
Local· 23 Aug 2026

గోదావరిఖనిలో కరెంటు బంద్!

గోదావరిఖని లక్ష్మీ నగర్, రాహుల్ హాస్పిటల్, పాత పంచాయతీ ఆఫీసు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంటు ఆగిపోతుంది. కారణం – మరమ్మత్తు పనులు. ట్రాన్స్కో ఈస్ట్ ఏఈ జమిల్ పాషా ఇదే విషయం క్లియర్ చేశారు. ఇంట్లో ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇన్వర్టర్స్ బ్యాకప్ ఇప్పుడే చేసుకోండి.. లేదంటే 6 గంటల పాటు 'నో చార్జ్' టెన్షన్ మూడుతుంది. అధికారులు వినియోగదారుల సహకారం కోరుతున్నారు. ఈ సమయంలో ఆఫ్లైన్ పనులు పూర్తి చేసేసుకోవడమే స్మార్ట్ ట్రిక్!

BREAKING: ఆటోల బంద్ లేదు..చర్చలు సఫలం
Current Affairs· 23 Aug 2026

BREAKING: ఆటోల బంద్ లేదు..చర్చలు సఫలం

TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి చేయాలనుకున్న సమ్మె లేనట్టు ప్రకటించారు. ఈ మేరకు లెటర్ రిలీజ్ చేశారు. ఆటో కార్మికుల డిమాండ్స్‌కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారు.

కుల వివక్షను అంతం చేయాలి
Local· 23 Aug 2026

కుల వివక్షను అంతం చేయాలి

AP : చిత్తూరు జిల్లాలో కుల వివక్షను అరికట్టి సామాజిక న్యాయం అందించాలని పలమనేరులో నాయకులు ఓబుళరాజు, ఈశ్వర్ డిమాండ్ చేశారు. 'సామాజిక శంఖారావం' కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళిత కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికలు కల్పించాలని కోరారు. భూమిలేని దళిత కుటుంబాలకు రెండెకరాల భూమి ఇవ్వాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

MRPS మండల సమావేశం
Local· 23 Aug 2026

MRPS మండల సమావేశం

TG : ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల MRPS సమావేశం జరుగుతుంది. స్థానిక GM పటేల్ మినీ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ ఉంటుంది. గ్రామాల్లో కొత్త కమిటీల ఏర్పాటుపై ఇందులో చర్చిస్తారు. దళితులపై జరుగుతున్న దాడులు, సమస్యలపై కూడా మాట్లాడుతారు. అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి తప్పకుండా రావాలని MRPS నాయకులు కోరారు.

చెడు మార్గంలో యువత
Local· 23 Aug 2026

చెడు మార్గంలో యువత

AP : గుంటూరు జిల్లా మంగళగిరిలో DYFI 14వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడారు. డ్రగ్స్ మాఫియా వల్లే నేటి యువత చెడు మార్గంలోకి వెళ్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, నిరుద్యోగం కూడా రోజురోజుకూ పెరిగిపోతోందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు పోరాడినట్లే, నేడు కూడా స్వేచ్ఛ కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అమ్మనాన్నలను బాగా చూసుకుంటాం
Local· 23 Aug 2026

అమ్మనాన్నలను బాగా చూసుకుంటాం

TG : జగిత్యాల జిల్లాలో అనాథలుగా మారిన వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదులపై కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు వృద్ధుల సంరక్షణ చట్టం గురించి చెప్పారు. దీంతో కొడుకులు, కూతుళ్లు మారారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని బాండ్ పేపర్లు రాసిచ్చి, తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు.

ఒకే వేదికపై 200 మంది కళాకారులు
Local· 23 Aug 2026

ఒకే వేదికపై 200 మంది కళాకారులు

TG : పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలంలో ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో జానపద వేడుకలు ఘనంగా జరిగాయి. కృషి కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 200 మంది జానపద, శాస్త్రీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కళాకారుల కోసం ఒక ఆడిటోరియం నిర్మించాలని సంస్థ అధ్యక్షుడు రాజమౌళి పాలకులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు.

పదేళ్ల శ్రమకు ఫలితేది?
Local· 23 Aug 2026

పదేళ్ల శ్రమకు ఫలితేది?

TG : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లకు సరైన వేతనాలు చెల్లించాలని గిరిజన సంఘం నాయకుడు అప్పల నర్ష డిమాండ్ చేశారు. పాడేరు మోదకొండమ్మ ఆలయ కమ్యూనిటీ భవనంలో జరిగిన గిరిజన రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి గెలిచినా, కేవలం కిలోకు రూపాయి కమిషన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా డీలర్లకు మంచి జీతం ఇవ్వాలని తెలిపారు.

SI, కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్
Local· 23 Aug 2026

SI, కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్

TG : ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఇచ్చే 60 రోజుల ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ముగిసింది. నలంద, శ్రీ చైతన్య, చావర సెంటర్లలో జరిగిన ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3,446 మంది హాజరయ్యారు. టెస్టులో మంచి మార్కులు సాధించిన వారితో పాటు స్థానిక ఆదివాసీ యువతకు ప్రాధాన్యమిస్తూ 300 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కేంద్రాలను పరిశీలించి, 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వాడుకుని ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే
Local· 23 Aug 2026

కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే

AP : కళలను, కళాకారులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నాయకులు చంద్రనాయక్, పెంచలయ్య అన్నారు. వినుకొండలో జరిగిన పల్నాడు జిల్లా సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వ సాయం లేక రాష్ట్రంలో నాటకాలు, కళల పరిస్థితి బాగా పాడైపోయిందని బాధపడ్డారు. ప్రత్యేక శాఖ ఉన్నా కళాకారులకు పైసా ఉపయోగం లేదని, బడ్జెట్‌లో డబ్బులు పెట్టకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని అడిగారు. ప్రజల కష్టాలను బయటపెడుతూ, కొత్త పాటలు, నాటకాల ద్వారా జనాల్లో మేల్కొలుపు తేవడానికి తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు.

70 ఏళ్ల వయసులో రైతుకు కొత్త జీవితం
Local· 23 Aug 2026

70 ఏళ్ల వయసులో రైతుకు కొత్త జీవితం

TG : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ సక్సెస్ అయింది. సిరిసేడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతుకు 16 ఏళ్ల క్రితం కాలేయానికి ఆపరేషన్ జరిగింది. అయితే మళ్లీ కాలేయంతో పాటు కడుపు భాగంలోకి వ్యాధి వ్యాపించింది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో దాదాపు 8 ఆసుపత్రులు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోలేదు. చివరకు జమ్మికుంట హాస్పిటల్‌లో డాక్టర్ ను సంప్రదించారు. ఆయన పరీక్షించి కాలేయంలో 12 తిత్తులు ఉన్నట్లు గుర్తించారు. తన అనుభవంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి రైతు ప్రాణాలను కాపాడారు.

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
Local· 23 Aug 2026

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

AP : నెల్లూరు జిల్లా కలిగిరి పెద్ద చెరువులో మట్టి మాఫియా విచ్చలవిడిగా తోడేస్తోంది. అధికారుల సహకారంతోనే హిటాచీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి రోజూ టన్నుల కొద్దీ మట్టిని అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. పొలం పనుల పేరుతో పర్మిషన్ తెచ్చుకుని, బయట వ్యాపారాలకు మట్టిని అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. చెరువును లోతుగా తవ్వేస్తుండటంతో అది పెద్ద గోతిలా మారిపోయింది. దీనివల్ల పశువులకి, జనాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను ఆపాలని ఊరి జనం కోరుతున్నారు.

బతికున్న మహిళ చనిపోయిందని..గదికి తాళం వేసిన పోలీసులు
Current Affairs· 23 Aug 2026

బతికున్న మహిళ చనిపోయిందని..గదికి తాళం వేసిన పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెమెతరా జిల్లాలోని పరుశురామ్ చౌక్‌లో ఉరి వేసుకున్న మహిళను చూసిన పోలీసులు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆమె మరణించినట్లు భావించారు. ఆ తర్వాత గదిలోకి మరెవరూ వెళ్లకుండా తాళం వేశారు. పంచనామా కోసం తలుపులు తెరవగా ఆ మహిళలో కదలికలు కనిపించాయి. ఆమె ఇంకా బతికే ఉందని గమనించిన కుటుంబసభ్యులు ఉరితాడు నుంచి కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సమస్యలతో విసిగిపోయారా? కలెక్టరేట్‌కి పదండి!
Local· 23 Aug 2026

సమస్యలతో విసిగిపోయారా? కలెక్టరేట్‌కి పదండి!

AP : కాకినాడ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేర్వేరుగా ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దరఖాస్తులు అందించవచ్చు. ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తుల పరిష్కార పరిస్థితి ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి అర్జీదారులు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రశ్నించే గొంతు నొక్కడం సరికాదు
Local· 23 Aug 2026

ప్రశ్నించే గొంతు నొక్కడం సరికాదు

AP: కాలేజీల్లోకి రాకుండా ఆంక్షలు పెడుతూ ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేయాలని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్ యూనియన్ కర్నూలు కలెక్టరేట్ దగ్గర ప్రొటెస్ట్ చేసింది. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రామిసెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదని, వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదంటూ స్టూడెంట్స్ ఫైర్ అయ్యారు.హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రశ్నించే గొంతు నొక్కడం సరికాదని మండిపడ్డారు. ఇచ్చిన్ హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మనుస్మృతిపై రాహుల్ గాంధీ సంచలనం
Current Affairs· 23 Aug 2026

మనుస్మృతిపై రాహుల్ గాంధీ సంచలనం

పూణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళల సాధికారత, స్వేచ్ఛపై మాట్లాడారు. ‘పింజ్రా తోడా’(పంజరాన్ని బద్దలు కొట్టండి) థీమ్‌తో విద్యార్థులతో మాట్లాడిన ఆయన మహిళలపై మనుస్మృతిలోని భావజాలాన్ని విమర్శించారు. బాల్యంలో స్త్రీ తండ్రికి, యవ్వనంలో భర్తకు, ఆ తర్వాత కొడుకులకు చెందాలని రాశారని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని చెప్పారని ఆయన అన్నారు. ఇలాంటి మాటలు సిగ్గుచేటు అని వివరించారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.

దళితవాడల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా
Local· 23 Aug 2026

దళితవాడల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా

AP : కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని పిరాయవరం, తిమ్మాపురం దళితవాడల్లో స్మశానాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇళ్ల స్థలాలు సరిగ్గా లేవని నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామాల ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు.

రావులపాలెంలో పెన్షనర్స్ బిల్డింగ్
Local· 23 Aug 2026

రావులపాలెంలో పెన్షనర్స్ బిల్డింగ్

AP : విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో మండల పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా వారి అనుభవం ఎంతో విలువైనదని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

సైన్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడికి నివాళులు!
Local· 23 Aug 2026

సైన్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడికి నివాళులు!

AP : ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సంతాప సూచకంగా యానాంలో నివాళులర్పించారు. జనవిజ్ఞాన వేదిక, CITU నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్‌ని కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం చేయకుండా, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. నేటి తరానికి ఆయన నిజంగా ఒక మార్గదర్శి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీ సత్యనారాయణ, దాట్ల దేవానందం, అశోక్, దుర్గాప్రసాద్, కుంచే సత్యనారాయణ, రాంబాబు, వాకపల్లి శాస్త్రి, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.