← Back to news

‘నేను ఎవరి బాణాన్ని కాదు’.. కొడంగల్‌లో కవిత స్పీచ్

By Mahesh· 1d ago· TG

TG: కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ విడిచిన బాణం కాదు.. KCR వదిలిన బాణం కాదు.. తెలంగాణ బహుజనుల బాణాన్ని’ అని అన్నారు. తెలంగాణ యువత యుద్ధ నినాదం, <a href="https://x.com/RaoKavitha/status/2101647797640380805">అంబేడ్కర్‌ వాదం,</a> జ్యోతిబా పులే ఆత్మగౌరవ నినాదాన్ని తానేనని చెప్పారు. ఎవరి సపోర్ట్ లేకుండా మహిళ రాజకీయాల్లో నిలబడగలదని నిరూపించేందుకే వచ్చానన్నారు. తెలంగాణలో మాతృస్వామ్య వ్యవస్థ రావాలని, విద్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత ప్రశ్నించారు.

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 51m ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.

బంజారాహిల్స్‌‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి
TG· 1h ago

బంజారాహిల్స్‌‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి

TG: పిల్లలందరికీ దగ్గర్లోనే మంచి ప్రభుత్వ స్కూల్ అందుబాటులో ఉండాలని రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి అన్నారు. TPF <a href="https://www.theclearcutnews.com/n/tNXHyWg">విద్యాబస్సు యాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆయన మాట్లాడుతూ ఆశ్రమ, రెసిడెన్షియల్, గురుకుల స్కూళ్లు అందరికీ శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉన్న గురుకులాలకు పంపేందుకు ఆలోచించే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్కూళ్లలో సౌకర్యాలు ఎలా ఉంటాయో, ఆదివాసీ గ్రామాల బడుల్లోనూ అలాంటి వసతులు ఉండాలని డిమాండ్ చేశారు.