← Back to news

వైసీపీ DSC ర్యాలీకి నో పర్మిషన్.. పోలీసుల హెచ్చరిక

By Mahesh· 22h ago· AP
వైసీపీ DSC ర్యాలీకి నో పర్మిషన్.. పోలీసుల హెచ్చరిక

AP: విజయవాడలో రేపు YSRCP చేస్తున్న DSC ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీ చేస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ DSP కృష్ణకాంత్ పటేల్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో సెక్షన్ 30 అమల్లో ఉందని తెలిపారు. VIP జోన్ పరిధిలో ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. పోలీసుల సూచనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలీసులను కోరారు.

More in AP