రేపు ఇందిరమ్మ ఫ్లాట్లకు అలాట్‌మెంట్ లెటర్స్

TG: ఇందిరమ్మ LIG ఫ్లాట్ల అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు రేపు అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయనుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సప్, SMS ద్వారా నేరుగా లెటర్లు పంపనున్నారు. హౌసింగ్ బోర్డు <a href="https://tghb.telangana.gov.in/">వెబ్‌సైట్</a> నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్ రాయదుర్గంలో 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2.85 ఎకరాల స్థలంలో 480 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి ఇనాగురేట్ చేయనున్నారు.



