← Back to news

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి ఊడిపడిన పైపు!

By A.Ajay· 1h ago

TG : హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి రైన్‌వాటర్ పైపు ఊడిపడి కింద రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌పై పడింది. దీంతో స్కూటర్ ముందు భాగం దెబ్బతింది. హెల్మెట్ పెట్టుకోవడంతో బైకర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్కూటర్‌ను 15 రోజుల క్రితమే కొన్నానని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు ఫ్లైఓవర్‌పై ఉన్న పైపులను చెక్ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే ఫ్లైఓవర్‌పై ఆగస్టులోనూ పైపు పడిన ఘటన జరిగింది.

More in TG