“టెక్ సపోర్ట్” కాల్.. సైబర్ స్కామ్ కావచ్చు!

ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ కాల్ సెంటర్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులు 3 ప్రదేశాల్లో ఒకే టైంలో రైడ్‌లు చేసి 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో కాల్ సెంటర్ ఓనర్లు, మేనేజర్లు, బ్యాంకర్లు, టెలికాలర్లు ఉన్నారు. పోలీసులు 27 ల్యాప్‌టాప్‌లు, 28 మొబైల్‌లు, 11 రూటర్లు, 36 హెడ్‌ఫోన్‌లను సీజ్ చేశారు. ఈ నెట్‌వర్క్ అమెరికా, కెనడా సిటిజన్లను టెక్నికల్ సపోర్ట్ పేరుతో మోసం చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వాళ్ల ఉచ్చులో మనం చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉందాం!



