బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై యువతి కంప్లైంట్

మహారాష్ట్ర కల్యాణ్‌లోని మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌తోపాటు సస్పెండెడ్ పోలీసు శైలేష్ పాటిల్ మీద 22 ఏళ్ల వివాహిత యువతి ఫిర్యాదు చేసింది. వీరిద్దరూ కత్తి చూపి తనపై లైంగికదాడి చేశారని ఆమె చెప్పింది. సెప్టెంబర్ 13న పవార్ ఆమెను తన ఆఫీసుకు పిలిచి ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లాడని, అక్కడ శైలేష్ పాటిల్ కత్తి చూపి బెదిరించి ఇద్దరూ తనపై లైంగికదాడి చేశారని కంప్లైంట్ చేసింది.



