15 వేల రూపాయల కోసం..బాలిక కిడ్నాప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలీలో రూ.15 వేల అప్పు కోసం 13 ఏళ్ల బాలికను RO వాటర్ ప్లాంట్‌లో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక కిరాణా షాపుకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా RO ప్లాంట్ నుంచి ఏడుపు వినిపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని తాళం పగలగొట్టి బాలికను రక్షించారు. ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి ఉన్నట్లు తెలిపారు. అప్పు వివాదమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు.



