రేపు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం జరగలిసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నిర్మల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించే సమావేశానికి జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మండల కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చని సూచించారు.



