భగత్ సింగ్ స్ఫూర్తితో వివక్షకు వ్యతిరేకంగా...

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, పిడిఎస్ యు, పిఎల్ వై ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పిఎల్ వై గ్రామ అధ్యక్షుడు రాయిండ్ల వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోకినపల్లి నవీన్, పూజల మహేందర్, పరికిపల్లి నరేష్ తదితరులు మాట్లాడారు. భగత్ సింగ్ ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకమని, కుల, మత వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.



