15 కి.మీ రహదారికి తారు రోడ్డు కావాలి..!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు మండలంలోని గుత్తులపుట్టు–కిముడుపల్లి మధ్య 15 కి.మీ రహదారి అధ్వానంగా మారింది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డు గుంతలమయంగా ఉంది. విద్యార్థులు, రైతులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే నూతన తారు రోడ్డు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, నాయకులు లకే భాస్కరరావు పాల్గొన్నారు.



