← Back to news

అంధ క్రికెటర్లకు లోకేష్ సపోర్ట్!

By epuri rajaratnam· 2h ago· Tadepalli, Tadepalli, Guntur
అంధ క్రికెటర్లకు లోకేష్ సపోర్ట్!

గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు అజయ్ కుమార్ రెడ్డి. ఆయన భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత. సోమవారం జరిగిన ఈ భేటీలో అంధ క్రికెటర్లకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక క్రీడా మైదానం కావాలని కోరారు. లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం తరఫున ఆడిన అంధ క్రికెటర్లకు తగిన ప్రోత్సాహం ఇస్తామన్నారు. అవసరమైన సహకారం అందించడంలో తాను వ్యక్తిగతంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.

More in Local