← Back to news

జాషువా జయంతి.. సామాజిక చైతన్య స్ఫూర్తి

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
జాషువా జయంతి.. సామాజిక చైతన్య స్ఫూర్తి

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గుర్రం జాషువా 131వ జయంతి జరిగింది. తెలుగు విభాగం నిర్వహించింది. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని తెచ్చారని ఆమె అన్నారు. కుల, మత, సామాజిక వివక్షను ప్రశ్నిస్తూ సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం విలువలను రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతి రావు తెలిపారు.

More in Local