లిప్ట్‌లో చిక్కుకున్న యువకుడు

TG: మహబూబ్‌నగర్‌కు చెందిన రాహుల్ ఉప్పల్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ NRPలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని హాస్టల్‌కు వెళ్తుండగా ఉప్పల్ మెట్రోస్టేషన్ నుంచి రాత్రి 11గంటలకు 6-B స్కైవాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ సడెన్‌గా మధ్యలో ఆగిపోయింది. రాహుల్ లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యాడు. హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు లిఫ్ట్‌లో ఉన్న రాహుల్‌ను టెక్నీషియన్ సహాయంతో రాత్రి 1:15 గంటలకు సురక్షితంగా బయటకు తీశారు.


