← Back to news

DYFI 3వ మహాసభలు.. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆది

By Suryavamsham Ramu· 1h ago
DYFI 3వ మహాసభలు.. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆది

TG: వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో DYFI 3వ జిల్లా మహాసభలు నిర్వహించారు. మహాసభలకు DYFI రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD జబ్బార్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి వీపనగండ్ల మండలానికి చెందిన ఎం.ఆది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More in Local