← Back to news

మొత్తం కంకర.. ఇదీ రోడ్డు దుస్థితి

By Repalle Rajesh· 59m ago· Rajoli, Rajoli, Jogulamba Gadwal
మొత్తం కంకర.. ఇదీ రోడ్డు దుస్థితి

TG: జోగులాంబ గద్వాల జిల్లా మాన్‌దొడ్డి–తుమ్మిళ్ల రహదారి నాలుగేళ్లుగా కంకర రోడ్డుగానే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాన్‌దొడ్డి, నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకునేందుకు ఇదే సమీప మార్గం. రోడ్డుపై గుంతలు, కంకర కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.

More in Local