← Back to news

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

By B V Appalanaidu· 1h ago· Sunkarametta, Araku Valley, Alluri Sitharama Raju
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

AP: డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, దాని నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి అన్నారు. అరకులోయ మండలం సుంకరమెట్టలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత, మహిళల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

More in Local