ముత్యాలమ్మ తల్లికి బోనాలు

AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సస్యశ్యామలంగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామస్తులు అమ్మవారిని ప్రార్థించారు. బోనాల కార్యక్రమం అనంతరం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చాలాకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమ్మవారికి బోనాలు సమర్పించిన రోజే వర్షం కురవడంతో గ్రామంలో భక్తి, ఆనంద వాతావరణం నెలకొంది.




