← Back to news

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి: DMHO

By Surender Panuganti· 1h ago· Mahabubnagar
డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి: DMHO

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ శ్రీనివాసులు సూచించారు. గౌరీశంకర్ కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమతెరలు వాడాలని కోరారు. రెండు, మూడు రోజులకుపైగా జ్వరం ఉంటే యూపీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఫీల్డ్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

More in Local