← Back to news

ఆకులు తినిపించిన టీచర్

By BK· 1h ago· మెదక్ జిల్లా
ఆకులు తినిపించిన టీచర్

TG : మెదక్ జిల్లా నర్సాపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న దీప అనే స్టూడెంట్‌కు క్లాస్ టీచర్ శ్రీలత ఆకులు తినిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్ క్లీన్ చేస్తుండగా స్టూల్ వేరే స్టూడెంట్ కి తగిలిందనే కారణంతో టీచర్ ఇలా చేసిందని, దానివల్ల పాపకి వాంతులు అయ్యాయని తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ప్రశ్నించిన తల్లిదండ్రులతో టీచర్ అనుచితంగా ప్రవర్తించడంతో, కలెక్టర్ ప్రతిమ సింగ్‌కి ఫిర్యాదు చేస్తూ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

More in TG