← Back to news

మహిళా అటెండర్ పై వేధింపులు

By BK· 1h ago· నల్గొండ జిల్లా
మహిళా అటెండర్ పై  వేధింపులు

TG : నల్గొండ జిల్లా నకిరేకల్ ICDS ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మానసికంగా వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన డ్యూటీకి ఆటంకం కలిగిస్తూ హరాస్ చేస్తున్నారంటూ ఆఫీస్ ఏరియాలోనే ఆమె చేసిన వీడియో వైరల్ అయింది. తనకు జరుగుతున్న వేధింపులపై హయ్యర్ ఆఫీసర్స్‌కు కంప్లైంట్ చేస్తానని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

More in TG