చేతికొచ్చిన పంటను నాశనం చేసిన దుండగులు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో దారుణం జరిగింది. రైతు మాధవరెడ్డికి చెందిన 16 గుంటల వరి పంటపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. ఈ దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి. పంట ఎండిపోవడంతో 50 వేల రూపాయల నష్టం జరిగిందని, గతంలోనూ తనను వేధించారని రైతు తెలిపారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాడు.



