← Back to news

ఐఫోన్ కొనివ్వలేదని నానమ్మపై దాడి!

By Mahesh· 54m ago· Uttar Pradesh
ఐఫోన్ కొనివ్వలేదని నానమ్మపై దాడి!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌లో దారుణ ఘటన జరిగింది. ఐఫోన్ కొనివ్వడంతో పాటు ఖర్చుల కోసం 3 లక్షల రూపాయలు ఇవ్వాలని నానమ్మను మనవడు అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తను కూడా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఖరీదైన బైక్ కొనిచ్చినా.. ఫోన్, డబ్బు కోసం కొట్టాడాని ఆమె (నానమ్మ) పోలీసులకు కంప్లైంట్ చేసింది. మనవడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరింది. <a href="https://x.com/pulsenewsbreak/status/2100193231170589035?s=20">వీడియో లింక్</a>

More in National

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్
National· 2h ago

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ఆయన ప్రకటించుకున్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2022 నవంబర్ 16న బెంగళూరులో కర్ణాటక మీడియా అకాడమీ నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో ‘మన ప్రధాని ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పూర్తి నిబద్ధతతో పని చేశారు. నేను మోదీజీ భక్తుడినని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని ఆయన అన్నారు. ఆ భక్తే ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.