← Back to news

నాన్న ఇచ్చిన ధైర్యం.. అడవి ఆఫీసర్‌గా చేసింది

By VIJAY KUMAR· 5h ago· Warangal
నాన్న ఇచ్చిన ధైర్యం.. అడవి ఆఫీసర్‌గా చేసింది

TG : వరంగల్ జిల్లా అశోక్‌నగర్ సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రీనా తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. చిన్నప్పుడు చిన్నజీవులను చూసినా భయపడే తాను, ఈ రోజు అడవిలో అధికారిగా పనిచేస్తున్నానంటే తండ్రి నేర్పిన ధైర్యమే కారణమని చెప్పారు. తన తండ్రి శివంగిలా ధైర్యంగా పెంచడం వల్లే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతున్నానని తెలిపారు. ధైర్యంగా అడుగు వేస్తే ఏ సమస్యైనా చిన్నదైపోతుందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతూ సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.

More in TG