నీరు లేక పంట నష్టం.. రైతు ఆత్మహత్య

TG: ఆదిలాబాద్ జిల్లా.. లాండాసాంగ్వి గ్రామానికి చెందిన రైతు, 47 ఏళ్ల తీగల రమేశ్.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. తన 8 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో సరిపడా వర్షాలు లేక, పంటలకు నీరు అందక.. దిగుబడి రాక.. పెట్టుబడి కోసం తీసుకున్న సుమారు 15 లక్షల రూపాయల అప్పు తీర్చలేక తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది.



