చెత్త సేకరణతో స్టూడెంట్స్ వరల్డ్ రికార్డు

AP: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTMC).. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ‘మన ఊరు.. మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించగా.. 35,147 మంది గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఒక్కరోజులో 75 వేల కేజీల పొడి చెత్తను సేకరించారు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు నిడమర్రులోని లీప్ హైస్కూల్ నుంచి, జూమ్ ద్వారా ప్రోగ్రాంని పరిశీలించి, రికార్డ్ కన్ఫామ్ చేశారు. MTMC అధికారులకు రికార్డు సర్టిఫికెట్ ఇచ్చారు.


