స్విమ్స్ వార్డుబాయ్‌ల వేతనాలు పెంచాలి: సీఐటీయూ

తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SWIMS) ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డుబాయ్‌లు, ఇతర కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకులు టీటీడీ అధికారులను కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, జిల్లా కార్యదర్శి కె.వేణుగోపాల్, SWIMS యూనియన్ ప్రధాన కార్యదర్శి రవి, తదితరులు టీటీడీ పరిపాలనా భవనంలో JEO ప్రభల గోపీనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.



