"సుప్రీంకోర్టుకు వెళ్తాం": చంద్రబాబు

AP: రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్టోబర్ 2న సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు CM చంద్రబాబు. "1995లో స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. BCలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం" అని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు AP కూటమి ప్రభుత్వం జీవో 105, 1065లను జారీ చెయ్యగా.. హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% క్యాప్‌ని దాటి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.


