వినుకొండలో రోడ్డు ప్రమాదం

AP : పల్నాడు జిల్లా వినుకొండ శివారులోని లయోలా స్కూల్ దగ్గర ఇవాళ ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచూర్ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్‌కి కాటన్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న వెహికల్‌ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్‌లో నందికొట్కూరుకు చెందిన మల్లి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్స్ వెంటనే రెస్క్యూ చేసి అతన్ని హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ఘటనపై మరిన్ని డిటైల్స్ రావాల్సి ఉంది.



