చింతలపల్లిలో ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి విజ్ఞాన్ నగర్లో శుక్రవారం బత్తుల సరస్వతీరావు ఆధ్వర్యంలో ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి నల్లి నాగబాబు, గెడ్డం సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాల పుస్తకాలు పంపిణీ చేసి, ఆశయాలను ప్రజలకు వివరించారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి యువత కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



